Telugu Gateway
Movie reviews

తెగింపు మూవీ రివ్యూ

తెగింపు మూవీ రివ్యూ
X

సంక్రాంతి సినిమాల పండగ స్టార్ట్ అయింది. కాకపోతే తమిళ డబ్బింగ్ సినిమా తెగింపు తో ఇది ప్రారంభం అయింది. వరసగా శనివారం వరకు ఈ హడావుడి కొనసాగనుంది. అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమానే ఇది. తెలుగు లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటంతో అజిత్ నటించిన ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనే విడుదల అవుతుంది. ఇందులో అజిత్ సరసన మంజు వారియర్ నటించారు. ఇతర కీలక పాత్రల్లో సముద్ర ఖని, అజయ్ లు ఉన్నారు. దైర్యం లేక పోతే వెలుగులు ఉండవు అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకులకు పెద్దగా వెలుగులు కనిపించవు అనే చెప్పాలి. బ్యాంకు , ,మ్యూచువల్ ఫండ్స్ పేరుతో అమాయక ప్రజలను ఎలా మోసాలు చేస్తున్నారు అన్నదే ఈ సినిమా కధ. ఒక బ్యాంకు చెస్ట్ లో ఉండాల్సిన దానికంటే 500 కోట్ల రూపాయలు ఎక్కువగా ఉంటాయి. వాటినే కొట్టేయటానికి అందులోని వాళ్లే కుట్ర చేస్తారు. దీనికోసం అంతర్జాతీయంగా గ్యాంగస్టర్ గా ఉన్న అజిత్ కుమార్ ను సంప్రదిస్తారు. అయితే ముందు ఈ పని చేపట్టడానికి నో చెప్పిన హీరో ..మళ్ళీ ఇందులోకి ఎందుకు ఎంటర్ అవుతాడు..కానీ అక్కడ ఉన్న మొత్తం ఎంత అని తేలింది...దాన్ని ఏమి చేశారు అన్నదే తెగింపు కథ.

ఈ సినిమాకు తెలుగులో వచ్చిన జులాయి తో పాటు పలు సినిమాలకు ఇది దగ్గరగా ఉంటుంది. తెగింపు సినిమా ఫస్ట్ హాఫ్ అంత సో సో గానే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కాస్త యాక్షన్ సన్నివేశాలతో స్పీడ్ పెరుగుతుంది. సినిమాలో కాస్త నవ్వించిన సన్నివేశాలు అంటే మీడియా కు సంబంధించి స్పాట్ లో ఉండే రిపోర్టర్ కు ఎదురయ్యే ఇబ్బందులు...స్టూడియో లో ఉండే వాళ్ళు చేసే హంగామా వంటి సన్నివేశాలను మాత్రం సరదాగా తెరకెక్కించాడు. పోలీస్ ల దగ్గర నుంచి మీడియా కు సమాచారం ఎలా వస్తుంది...చివరకు ఎక్సక్లూసివ్ విజువల్స్ కోసం పోలీస్ లకు డబ్బులు ఇవ్వటానికి కూడా సిద్దపడటం వంటివి వాస్తవానికి దగ్గరగా చూపించారు. ఈ సినిమా లో ఒక్క హీరో అజిత్ కుమార్ కుమార్ తప్ప మిగిలిన పాత్రలు అన్ని చాలా పరిమితం అయినవే. మొత్తంమీద సంక్రాంతి సీజన్ లో విడుదల అయిన తొలిసినిమా అంత ఆకట్టుకోలేదనే చెప్పాలి. యాక్షన్ ప్రేమికులకు కూడా ఇది ఒక రొటీన్ సినిమానే.

రేటింగ్: 2 . 25 -5

Next Story
Share it