'శ్యామ్ సింగరాయ్' మూవీ రివ్యూ
రెండు సినిమాలు ఓటీటీలో విడుదల చేసిన తర్వాత హీరో నాని కొత్త సినిమా 'శ్యామ్ సింగరాయ్' శుక్రవారం నాడు థియేటర్లలో విడుదల అయింది. సహజంగానే నాని..సాయిపల్లవిల నటన అంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. కృతి శెట్టి తొలి సినిమా తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరి ఇంత మంది కీలక పాత్రదారులు ఉన్న సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. నాని ఇందులో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషించారు. ఒకట వాసుదేవ్, రెండవది శ్యామ్ సింగరాయ్. వాసుదేవ్ ఎలాగైనా డైరక్టర్ కావాలనే తపనతో ఓ షార్ట్ ఫిలిం పూర్తి చేసేందుకు నానా కష్టాలు పడుతుంటాడు. తాను అనుకున్న పాత్రకు సరైన అమ్మాయి అని కాపీ షాప్ లో కలిసిన కృతి శెట్టిని ఎలాగోలా ఒప్పిస్తాడు. ఆ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో పడతారు. అయితే నాని షార్ట్ పిలింకు ఎంచుకున్న కథ..ఆ తర్వాత తీసిన ఉనికి సినిమా కథ కాపీ అనే కేసు నమోదు కావటంతో కథ కొత్తమలుపు తిరుగుతుంది.
ఉనికి సినిమా హిట్ తో ఏకంగా వాసుదేవ్ కు బాలీవుడ్ లో కొత్త సినిమాల ప్రకటనలో సమయంలో పోలీసులు అరెస్ట్ చేయటంతో కథపై ఆసక్తి పెరుగతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్టాఫ్ లో సినిమా డైరక్టర్ గా మారేందుకు నాని చేసే ప్రయత్నాలు అంతా సో సో గానే సాగుతుంది. ఇందులో పెద్దగా ఉత్కంఠ రేపు అంశాలు ఏమీ కన్పించవు. అసలు కథ సెకండాఫ్ లో నాని శ్యామ్ సింగరాయ్ గా మారిన తర్వాతే సినిమా స్పీడ్ అందుకుంటుంటుంది. కోల్ కతాలో ఓ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ కథలు రాస్తూ..సమాజాన్ని మేలుకొలుపుతూ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు శ్యామ్ సింగరాయ్. ఆ క్రమంలోనే దసరా నవరాత్రుల సమయంలో దేవదాసిగా ఉన్న సాయిపల్లవిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. దేవదాసి పాత్రలో సాయిపల్లవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
దేవదాసిగా..నాట్యగత్తెగా ఆమె ఆకట్టుకుంటుంది. సాయిపల్లవి డ్యాన్స్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. దేవదాసి పాత్రతో తన హావభావాలతో ఆకట్టుకుంది. అయితే ఎప్పుడో శ్యామ్ సింగరాయ్ రాసిన కథలను వాసు దేవ్ ఎలా కాపీ కొట్టాడు..దీనికి వెనక కారణాలను బహిర్గతం చేసే సమయంలో పునర్జన్మ అంశాన్ని తెరమీదకు తెచ్చాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. రెండు పాత్రల్లో కన్పించిన నాని గురించి చెప్పుకోవాలంటే వాసు ది రొటీన్ పాత్రే. కానీ శ్యామ్ సింగరాయ్ గా మాత్రం తనదైన సత్తా చాటి తనలోని నటుడుని మేల్కొపాడు. లాయర్ పాత్రలో మాడోన్నా సెబాస్టియన్ తన పాత్రకు న్యాయం చేసింది. ఓవరాల్ గా చూస్తే శ్యామ్ సింగరాయ్ మూవీ ఫస్టాఫ్ డల్..సెకండాఫ్ ఫుల్ అని చెప్పొచ్చు. సాయిపల్లవి ఎంట్రీ కూడా సెకండాఫ్ లోనే ఉంటుంది.
రేటింగ్. 2.5-5