Telugu Gateway
Movie reviews

‘శాకుంతలం’ మూవీ రివ్యూ

‘శాకుంతలం’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే అందరికి ఫస్ట్ గుర్తు వచ్చే పేరు సమంత. అలాగే శాకుంతలం సినిమా కు సమంత పేరు ప్రకటించిన సమయంలోనే ఈ సినిమా పై కాస్త అంచనాలు పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు గుణ శేఖర్ కు అసలు సరైన హిట్ సినిమా నే లేదు. అయితే ఈ సినిమా స్టోరీ పైగా ప్రతిఒక్కరికి తెలిసిన కథ కావటంతో దీనిపై సహజంగా అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎక్కడైనా లెక్క తేడా కొడితే మాత్రం అసలుకే మోసం వస్తుంది. పలు మార్లు వాయిదాల అనంతరం శాకుంతలం సినిమా చివరకు ఈ ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అద్భుతమైన శకుంతల, దుశ్యంతుడి ప్రేమ కథే ఈ సినిమా స్టోరీ కావటంతో దీనిపై పెద్ద గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందులోని పాత్రధారులు ఎలాంటి నటన కనపర్చారు అన్నదే ఈ సినిమా కు అత్యంత కీలకం అయిన అంశం. అయితే ఇందులో సినిమా ను ముందుకు నడపాల్సిన బాధ్యత..కీలక పాత్రధారి సమంతపైనే ఉంది. అయితే సమంత పై మాత్రం తన అనారోగ్య ప్రభావం ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా సమంత ఈ సినిమాలో కనిపించిన ఎక్కువభాగం చాలా డల్ గా కనిపించారు.

దీనికి తోడు సినిమా కథ లో స్పీడ్ లేకపోవటంతో ఈ ప్రభావం సినిమాపై స్పష్టంగా కనిపించింది. దుశ్యంతుడుగా నటించిన దేవ్ మోహన్ చూడటానికి బాగానే ఉన్న బలమైన దుశ్యంతుడు పాత్రకు అవసరమైన నటన కనపరచటంలో విఫలం అయ్యాడు అనే చెప్పాలి. ఇలా ఇద్దరు కీలకపాత్రదారుల పాత్రల్లో జీవం లేకపోవటంతో సినిమా అంతా కూడా ఏదో భారంగా ముందుకు సాగుతుంది. ఈ సినిమా లో కాస్త ఆకట్టుకున్న పాత్ర ఏది అయినా ఉంది అంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పోషించిన భరతుడి పాత్రే అని చెప్పాలి. అల్లు అర్హ డైలాగులు చెప్పిన విధానం, వాకింగ్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా బలమైన సంఘర్షణ కనపడదు. సినిమా ముందుకు సాగిన విధానం చాలా మెల్లగా ఉంటడంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురి అవుతారు. ఈ సినిమా కు ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉంటడంతో ఈ సినిమా పై చాలా మందికి ముందు నుంచి అనుమానాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. అయితే ప్రతి థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో కు వచ్చిన ప్రేక్షకుల్లో సింహభాగం మహిళలే కావటం మరో విశేషం గా చెప్పుకోవాలి. సినిమా విజయం పూర్తిగా ఇప్పుడు మహిళల చేతుల్లో ఉంది అనే చెప్పాలి. వాళ్ళు పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తే ఓకే...లేక పోతే ఈ సినిమా కు కష్టాలే అని చెప్పొచ్చు.. ఫైనల్ గా దర్శకుడు గుణ శేఖర్ సినిమా ను ఆసక్తికరం గా మలచడంలో విఫలం అయ్యారు.

రేటింగ్ : 2 - 5

Next Story
Share it