Telugu Gateway
Movie reviews

యువ దర్శకుడు..సీనియర్ హీరో (Saindhav Movie Review)

యువ దర్శకుడు..సీనియర్ హీరో (Saindhav Movie Review)
X

ఈ సారి సంక్రాంతి రేస్ లో విక్టరీ వెంకటేష్ కూడా చేరారు. అందులోనూ అయన తన 75 వ సినిమా గా సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రొటీన్ కు బిన్నంగా శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. హిట్ సినిమాల సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కించటం కూడా ఈ సినిమాపై అందరిలో ఆసక్తి రేపింది అనే చెప్పాలి. ఓరి దేవుడాలో వెంకటేష్ గెస్ట్ రోల్ పోషించిన తర్వాత చేసిన సినిమా సైంధవ్. ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలో యువతకు శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆయుధాలతో సహా వివిధ గ్రూపులకు సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకుంటారు ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ విదేశాల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు...డ్రగ్స్, ఫేక్ కరెన్సీ తెప్పిస్తారు. ఇందులో ముకేశ్ రుషి తో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ, జిష్ణు సేన్ గుప్తాలు ఉంటారు. ఒకప్పుడు ఇదే టీం కోసం పని చేసిన వెంకటేష్ తర్వాత బయటకు వచ్చి ఒక పోర్ట్ లో పని చేస్తూ ఉంటాడు. అనుకోకుండా వెంకటేష్ కూతురికి ఒక అరుదైన జబ్బు వచ్చినట్లు బయటపడుతుంది. ఇది నయం కావాలంటే ఒక ఇంజక్షన్ చేయాలి..దాని ఖరీదు ఏకంగా పదిహేడు కోట్ల రూపాయలు అని చెపుతాడు డాక్టర్.

ఒక పోర్టులో పని చేసే వ్యక్తి అసలు పదిహేడు కోట్లు పెట్టి ఇంజక్షన్ కొనగలడా?. మరి హీరో తన కూతురిని కాపాడుకున్నాడా లేదా అన్నదే సినిమా. ఇందులో వెంకటేష్ కూతురిగా బేబీ సారా నటించింది. ఒక వైపు మాఫియా గ్యాంగ్ తో పోరాటం...మరో వైపు కూతురిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సైకో పాత్రలో విక్టరీ వెంకటేష్ తన సెటిల్డ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. తండ్రి, కూతుర్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాలో వైలెన్స్ వెంకటేష్ ను చూస్తారు ప్రేక్షకులు. వెంకటేష్ కు జోడిగా కనిపించిన శ్రద్దా శ్రీనాథ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ నవాజుద్దీన్ సిద్దిఖీ తన తెలుగు డైలాగులతో అందరిని నవ్విస్తాడు. విలన్ గ్యాంగ్ లో సిద్దిఖీకి జోడిగా కనిపించే ఆండ్రియా కూడా అదరగొట్టింది. వెంకటేష్, గెటప్ శీనుల మధ్య వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమా కథకు అనుగుణంగా సంతోష్ నారాయణన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక ఎన్ జీఓ నడిపే డాక్టర్ గా ఈ సినిమాలో ఉండేది కొద్ది సేపే అయినా కీలక పాత్రలో కనిపిస్తుంది రుహాణి శర్మ. మొత్తం మీద సైంధవ్ సినిమాను దర్శకుడు యాక్షన్, ఎమోషన్స్ గలగలిపి వెంకటేష్ కు హిట్ సినిమా ఇచ్చాడనే చెప్పాలి.

రేటింగ్: 2.75/5

Next Story
Share it