Telugu Gateway
Movie reviews

'రెడ్' మూవీ రివ్యూ

రెడ్ మూవీ రివ్యూ
X

హీరో రామ్. తొలిసారి ద్విపాత్రాభినయం. అందులోనూ దర్శకుడు కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన సినిమాలు రెండూ మంచి హిట్ అందుకున్నవే. దీంతో 'రెడ్' మూవీపై కూడా ప్రేక్షకుల్లో ఓ రకమైన అంచనాలు ఉన్నాయి. అంతే కాదు..ఇది తమిళంలో హిట్ అయిన తడమ రీమేక్. ఈ సినిమాలో రామ్ ఓ పాత్రలో పూర్తి మాస్...మరో పాత్రలో పూర్తి క్లాస్. రెండు పాత్రల మధ్య తేడాలు చూపించటంలో సక్సెస్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పూర్తి మాస్ పాత్రలో చేసిన రామ్..ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు. అయితే సినిమా సాగిన తీరు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఓ ఇంజనీర్. మరో దొంగల కథే ఈ సినిమా. సిద్ధార్థ్‌(రామ్‌) ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఎండీ. ఆయన మహిమ(మాళవికా శర్మ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా తన ప్రేమను ఒప్పుకునేలా చేస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ కావాలని అనుకుంటారు. మరో వైపు ఆదిత్య(రామ్‌) పెద్దగా చదువుకోడు. కానీ ఐదారు భాషల్లో నైపుణ్యం సాధిస్తాడు. మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఇద్దరి జీవితాలు భిన్నంగా వెళుతుంటాయి. అయితే అనుకోకుండా ఆకాశ్‌ అనే యువకుడిని ఒకరు హత్య చేస్తారు. దొరికిన ఫొటో ఆధారంగా పోలీసులు హ‌త్య చేసింది సిద్ధార్థ్ అని నిర్ధారణకు వచ్చి అరెస్ట్‌ చేస్తారు. పాత పగను మనసులో పెట్టుకున్న సీఐ(సంపత్‌) మాత్రం సిద్ధార్థ్‌ తప్పు చేయకపోయినా, అతన్ని కేసులో ఇరికించి శిక్ష పడేలా చేయాలని అనుకుంటాడు.

అదే సమయంలో ఆదిత్యను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఇద్దరూ ఒకేలా ఉండటంతో ఎవరు హత్య చేశారో పోలీసులకు అర్థం కాదు. ఇద్దరి బ్యాగ్రౌండ్ ను పోలీసులు చెక్‌ చేస్తారు. కేసు పురోగ‌తిలోనూ అనుమానించే అంశాలేవీ దొరకవు. దాంతో ఇద్దరినీ కోర్టు నిర్దోషులుగా వదిలేస్తుంది. అయితే కేసుని డీల్‌ చేసిన ఎస్సై యామిని(నివేదా పేతురాజ్‌)కి అసలు హంతకుడు ఎవరా? అనేది స‌స్పెన్స్‌ అలాగే ఉండిపోతుంది. ఆ సస్పెన్స్ వీడాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే. కథలో ట్విస్ట్‌ లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్‌ అవుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమాలోని కొన్ని సంభాషణలు ఆలోచింపచేసేవిలా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే 'రెడ్' ఓ సాదాసీదా సినిమాగానే మిగిలిపోతుంది.

రేటింగ్. 2.5/5

Next Story
Share it