రంగబలి హిట్టా... బ్లాక్ బస్టరా !
రంగబలి సినిమా బలం అంతా ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. ఎలాగైతే టీవీ సెలెబ్రిటీల స్పూఫ్ ఇంటర్వ్యూలతో దుమ్మురేపాడో సినిమాలో కూడా సత్య తన కామెడీ పాత్రతో...ఎవరైనా సంతోషంగా ఉంటే ఏ మాత్రం తట్టుకోలేని అగాధం క్యారెక్టర్ లో అదరగొట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో హీరో ను తన కామెడీతో డామినేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో కామెడీ తగ్గినా ఎక్కడా స్టోరీ గాడి తప్పకుండా చేసుకోవటంలో దర్శకుడు విజయం సాధించాడు. హీరో నాగ శౌర్య ప్రేమ కు...రంగబలి సెంటర్ కు లింక్ పెట్టిన విధానం, క్లైమాక్స్ లో అసలు ఆ సెంటర్ కు ఈ పేరు ఎలా వచ్చింది రివీల్ చేసినా విధానం కూడా ఆకట్టుకుంది. పాత్ర చిన్నదే అయినా శరత్ కుమార్ తెరపై ఉన్నంత సేపు ఇంపాక్ట్ చూపించారు. హీరోయిన్ యుక్తి తరేజా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర ప్రాధానత్య పెద్దగా లేదు అనే చెప్పాలి. దర్శకుడు ఒక పక్క సినిమా కథ గాడి తప్పకుండా నడుపుతూనే ఎంత మంచి చేసినా ఎప్పుడైనా...ఎక్కడైనా చిన్న తప్పు జారితే మాత్రం అంతకు ముందు చేసిన మంచి అంతా మర్చి పోయి ఆ తప్పునే ప్రజలు పట్టుకుని వేలాడుతారు అని చెప్పిన విధానం కూడా బాగుంది. మొత్తం మీద రంగబలి సినిమా హీరో నాగ శౌర్య చెప్పినట్లు బ్లాక్ బస్టర్ కాకపోయినా ఖచ్చితంగా హిట్ అనే చెప్పొచ్చు.
రేటింగ్: 3 -5