Telugu Gateway
Movie reviews

'రంగ్ దే' మూవీ రివ్యూ

రంగ్ దే మూవీ రివ్యూ
X

'భీష్మ' హిట్ తర్వాత హీరో నితిన్ చేసిన సినిమా 'చెక్' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ వెంటనే ఇప్పుడు 'రంగ్ దే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పటి ప్రేమ కథలతో ఇప్పటికే టాలీవుడ్ లో బోలెడు సినిమాలు వచ్చాయి. చిన్నప్పుడు అంటే..ఇది నాలుగేళ్ల నుంచి మొదలయ్యే ప్రేమ కథ అన్న మాట. ఓ నాలుగేళ్ల బుడ్డోడు కార్తీక్ (నితిన్) పక్క ఇంట్లోకి అను (కీర్తి సురేష్) వస్తుంది. అప్పటి నుంచి తన ఇంట్లో కూడా కార్తీక్ పై ఉండాల్సిన అటెన్షన్ అంతా కూడా అను వైపు మళ్ళుతుంది. అంతే కాదు చదువుతో పాటు ఏ పని చేసినా ఇంట్లో అనూ ను చూసి నేర్చుకో అంటూ క్లాస్ పీకటాలు. ఈ క్లాస్ ల కారణంగానే అనుపై ద్వేషం పెంచుకుంటాడు కార్తీక్. కానీ అను మాత్రం కార్తీక్ పై విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది. అనుకోకుండా జరిగిన ఓ ట్విస్ట్ లో వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. మరి పెళ్లి తర్వాత అయినా వీరిలో ప్రేమ చిగురిస్తుందా లేదా అన్నదే సినిమా. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూసి వాళ్ళను ప్రోత్సహించాలి కానీ ఎంతసేపూ పక్క వాళ్లను చూసి నేర్చుకోమని ఒత్తిడి చేయవద్దనే లైన్ తీసుకున్నా అది కూడా దారి తప్పింది.

సినిమాలో కాస్త కామోడీ అంటే బ్రహ్మజీ కన్సల్టెన్సీలో నడిడే సన్నివేశాలే. అంతే కాదు..డబ్బులిచ్చి రీ కౌంటింగ్ లో కార్తీక్ సాధించిన మార్క్ లు చూసి ఇంట్లో వాళ్లు షాక్ అయ్యే సన్నివేశాలు కాసేపు ప్రేక్షకులను నవ్విస్తాయి. విదేశీ యూనివర్శిటీలో చదువు కోసం కూడా డమ్మీ క్యాండిడేట్ తో పరీక్ష రాయించి దుబాయ్ యూనివర్శిటీలో సీటు దక్కించుకుంటాడు కార్తీక్. అదే సమయంలో వెన్నెల కిషోర్ ను తాము కోరుకున్న యూనివర్శిటీ నుంచి తప్పించే ప్లాన్ నవ్వులు పూయిస్తుంది. కీర్తి సురేష్ మరీ స్లిమ్ అయిన తర్వాత 'నేను లోకల్' సినిమా నాటి గ్లామర్ అంతా పోయింది. ఈ సినిమాలోనూ ఆమె డల్ గానే కన్పించింది. మరీ సెకండాఫ్ లో ఇది మరింత స్పష్టంగా కన్పిస్తుంది. నితిన్ స్నేహితులుగా చేసిన అభినవ్ గోమటం, సుహాస్ ల పాత్రలు కూడా రొటీన్ గానే ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'రంగ్ దే' మూవీ లో 'రంగులు' మిస్ అయ్యాయి.

రేటింగ్. 2.5/5

Next Story
Share it