Telugu Gateway
Movie reviews

రాధే శ్యామ్ మూవీ రివ్యూ

రాధే శ్యామ్ మూవీ రివ్యూ
X

ప్ర‌భాస్..పూజా హెగ్డె జంటగా సినిమా అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది. బాహుబ‌లి సినిమా రెండు భాగాల త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఓ లెవ‌ల్ కు పెరిగింది. టాలీవుడ్ లో ఇప్పుడు పూజా హెగ్డె హిట్ హీరోయిన్. ఆమె చేస్తున్న సినిమాలు అన్సీ స‌క్సెస్ బాట‌లో ప‌య‌నిస్తుండ‌టంతో..ప్ర‌భాస్ తో క‌ల‌సి పూజా న‌టించిన సినిమా అంటే అంచ‌నాలు భారీగా ఉండ‌టం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు. అంతే కాదు..ప్ర‌భాస్ కొత్త సినిమా విడుద‌లై సంవ‌త్స‌రాలే అయింది. సాహో త‌ర్వాత ఆయ‌న అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రాధే శ్యామ్ ప‌లుమార్లు వాయిదా ప‌డిన అనంత‌రం ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం నాడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. విక్ర‌మాదిత్య (ప్ర‌భాస్) ప్ర‌పంచంలోనే పేరుగాంచిన హ‌స్త‌సాముద్రికుడు. ప్రేర‌ణ (పూజా హెగ్డె) ఓ డాక్ట‌ర్. చేయి చూసి అంద‌రి జాత‌కాలు చెప్పే విక్ర‌మాదిత్య జీవితం మ‌ధ్య‌లోనే ముగిసిపోతుంద‌ని తెలుసుకుంటాడు. అందుకే త‌న జీవితంలో ప్రేమ‌కు, పెళ్లికి తావులేద‌ని చెబుతూ ఉంటాడు. డాక్ట‌ర్ గా ఉన్న ప్రేర‌ణ తీవ్ర‌మైన అనారోగ్యంతో మ‌ర‌ణిస్తుంద‌ని డాక్ట‌ర్లు తేలుస్తారు. అయితే విక్ర‌మాదిత్య మాత్రం ప్రేర‌ణ పూర్తి కాలం జీవితాన్ని గడుపుతుంద‌ని ఛాలెంజ్ చేస్తాడు. డాక్ట‌ర్లు చెప్పింది నిజ‌మా? లేక హ‌స్త‌సాముద్రికుడు చెప్పింది నిజం అవుతుందా?. మ‌రి త‌న జీవితంలో మ‌ధ్య‌లోనే ముగుస్తుంద‌ని భావించిన విక్ర‌మాదిత్య ఏమి అవుతాడు అన్న‌దే రాధేశ్యామ్ సినిమా.

మ‌న రాత మ‌న చేతుల్లో లేదు..చేత‌ల్లోనే ఉంటుంది అంటూ..మ‌ధ్య‌లో ప్రేమ క‌థ‌ను ద‌ర్శ‌కుడు రాధాక్రిష్ణ సినిమాను న‌డిపించారు. ప్ర‌భాస్ ఎంట్రీ స‌మ‌యంలో ఇచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మిన‌హా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ సినిమాలో ఎక్క‌డా జోష్ క‌న్పించ‌దు. ఈ సినిమాలో ఏదైనా హైలెట్ ఉంది అంటే రైలులో పూజా హెగ్డె నా బ‌రువు మోయ‌గ‌ల‌వా అంటే రెండు చేతులు బ‌య‌టిపెట్టి నేచ‌ర్ ను ఆస్వాదించే స‌న్నివేశాలే. అక్క‌డే తొలిసారి విక్ర‌మాదిత్య‌, ప్రేర‌ణ‌లు క‌ల‌యిక కూడా. విక్ర‌మాదిత్య చెప్పేది తప్పు అని నిరూపించేందుకు చ‌నిపోయిన వారి చేతి రాత‌లు ఉన్న జిరాక్స్ లు తీసుకొచ్చి వారి గురించి చెప్ప‌మ‌న్న‌ప్పుడు హీరో చెప్పే విష‌యాలు ఆక‌ట్టుకుంటాయి. ఈ సినిమాలో పూజా హెగ్డె కేవ‌లం గ్లామ‌ర్ గా క‌న్పించ‌ట‌మే కాకుండా..అటు చావు స‌మ‌స్య‌, మ‌రో వైపు ప్రేమ కోసం త‌పించే వ్య‌క్తిగా మంచి న‌ట‌న క‌న‌ప‌ర్చింది.

యూర‌ప్ బ్యాగ్రౌండ్ లో అంద‌మైన లొకేష‌న్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ అంటే హీరోయిజం చూపించే సినిమాలే త‌ప్ప ల‌వ‌ర్ బాయ్ సినిమాలు చేసింది లేదు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ స‌డ‌న్ గా ల‌వ‌ర్ బోయ్ గా మార‌టం..అందులోనూ ప్రేక్షకుల్లో జోష్ నింపే ఫీల్ ఎక్క‌డా లేక‌పోవ‌టంతో సినిమా అంతా నీర‌సంగా సాగుతుంది. గ‌త సినిమాల‌తో పోలిస్తే ప్ర‌భాస్ మ‌రింత స్లిమ్ గా మారినా మొహంలో ఫ్రెష్ నెస్ లేదు. ప్ర‌భాస్ త‌ల్లిగా న‌టించిన ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ హీరోయిన్ భాగ్య‌శ్రీ పాత్ర కు ఏ మాత్రం ఫ్రాధాన్య‌త లేదు. ఇలాంటి పాత్ర‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. ఓవ‌రాల్ గా చూస్తే రాధేశ్యామ్ ఓన్లీ కాస్తో కూస్తో క్లాస్ ప్రేక్షకుల‌కు మాత్ర‌మే న‌చ్చే సినిమా.

రేటింగ్. 2.5-5

Next Story
Share it