Telugu Gateway
Movie reviews

పఠాన్ మూవీ రివ్యూ

పఠాన్ మూవీ రివ్యూ
X

ఒక వైపు భారీ అంచనాలు. మరో వైపు వివాదాలు. మొత్తం మీద దేశవ్యాప్తంగా పఠాన్ పై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ఈ విషయాన్నీ నిర్దారించాయి. అదే సమయంలో షారుఖ్ ఖాన్ సినిమా రాక చాలా రోజులు కావటం కూడా ఈ సినిమా పై హైప్ కు కారణంగా నిలిచింది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే హాలిడేను వాడుకునేలా ఈ సినిమాను జనవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా ప్రధానంగా హీరో షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పడుకొనే చుట్టూనే తిరుగుతుంది ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అటు షారుఖ్ ఖాన్ తో పాటు జాన్ అబ్రహం కూడా తొలుత రా ఏజెంట్స్ గా పనిచేస్తారు. ఒకప్పుడు రా ఏజెంట్ గా పనిచేసిన జాన్ అబ్రహం ఎందుకు తీవ్రవాదులతో కలిసి భారత్ ను దెబ్బతీయయాలని చూస్తాడు. దీని వెనక ఏమి జరిగింది. మాజీ రా ఏజెంట్ అయినా జాన్ అబ్రహం టీం ఎత్తుగడలను షారుఖ్ ఖాన్ టీం ఎలా ఎదుర్కొన్నదే ఈ పఠాన్ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉన్న దీపికా పడుకొనే పాత్ర కూడా కథలో భాగంగానే కనిపిస్తోంది తప్ప...ఏదో హీరో , హీరోయిన్ల రొమాన్స్ కోసం , లవ్ ట్రాక్ కోసం పెట్టినట్లు పెట్టకపోవటం ఇందులో కీలకంగా ఉంది.

వాస్తవం చెప్పాలంటే పఠాన్ సినిమాలో కథ కొత్తగా ఏమీ అనిపించదు. కాకపోతే ఇందులోని యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా తెరకెక్కించారు. కొన్ని సంవత్సరాల క్రితం కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ఈ స్టోరీ కథకు ఒక కీలక పాయింట్ గా ఎంచుకున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం లు తమ తమ పాత్రల్లో పోటీ పడి నటించారు అని చెప్పొచ్చు. మధ్యలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ కూడా ఒకింత హంగామా తెస్తుంది ఈ సినిమాలో. దీపికా పదుకొనె కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. డింపుల్ కపాడియా, అశుతోష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. పఠాన్ సినిమాలో కీలకంగా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అంటే అవి యాక్షన్ సన్నివేశాలు...విజువల్స్ అనే చెప్పాలి. పలు చోట్ల హాలీవుడ్ సన్నివేశాలను తలపించేలా సీన్లు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే పఠాన్ సినిమా యాక్షన్ ప్రేమికులకు నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత అసలు దీనిపై వివాదం ఎందుకు వచ్చిందా అన్న అనుమానం రాక మానదు.

రేటింగ్: 3 /5

స్టేట్ ఫార్మషన్

Next Story
Share it