Telugu Gateway
Movie reviews

ఓరి దేవుడా మూవీ రివ్యూ

ఓరి దేవుడా మూవీ రివ్యూ
X

విశ్వక్ సేన్ అశోక్ వనం లో అర్జున కళ్యాణం సినిమా ద్వారా హిట్ కొట్టాడు. ఇప్పుడు ఓరి దేవుడా అంటూ సీనియర్ హీరో వెంకటేష్ తో కలసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమాలో కలసి పని చేసిన విషయం తెలిసిందే. అందులో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర పోషిస్తే ఈ సారి అంటే ఓరి దేవుడా సినిమాలో వెంకటేష్ దేవుడు పాత్ర పోషించారు. ఇక చిన్నప్పటి నుంచి కలసి చదువుకున్న వాళ్ళు ప్రేమలో పడటం..పెళ్లి చేసుకోవటం వంటి కథలు చాలానే వచ్చాయి. కానీ ఓరి దేవుడా సినిమా మాత్రం వెరైటీ సినిమా. చిన్నప్పటి ఫ్రెండ్స్ ప్రేమలో పడటం చాలా కామన్ పాయింట్ అయినా దీన్ని దర్శకుడు అస్వత్ మారి ముత్తు అద్భుతంగా తెరకెక్కించారని చెప్పొచ్చు. ప్రేమ లేకుండా అప్పటివరకు ఫ్రెండ్స్ గా ఉన్నవారు పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి ...వీటిని ఎలా పరిష్కరించుకున్నారు అన్నదే ఈ సినిమా. భార్యా భర్తలు గా మారిన ఫ్రెండ్స్ కు వచ్చిన సమస్యలను దేవుడు గా కనిపించిన వెంకటేష్ ఎలాంటి పరిష్కారం చూపించారు అన్నది కీలకం.

వెంకటేష్ ఈ సినిమా లో ఫస్ట్ హాఫ్ లోనే కనిపిస్తారు. చిన్నప్పటినుంచి కలసి పెరిగిన వారు పెళ్లి చేసుకున్న కొద్దీ రోజులకే ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటారు...తర్వాత ఏమి జరిగింది అన్నది వెండి తెర మీదే చూడాలి. సినిమా లో ట్విస్టులు, సెంటిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడా అసభ్యత కు తావు లేకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. తమిళం లో విజయవంతమైన ఓ మై కడవులె కి రీమేక్ గా ఓరి దేవుడా సినిమా తెరకెక్కింది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీరిద్దరి కాంబినేషన్..వారి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ల ప్రేమ మధ్యలో ఎంటర్ అయ్యే మీరా పాత్ర పోషించిన ఆశాభట్ కూడా సినిమాలో కీలక పాత్ర తో మంచిగా ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంత సరదా సరదా గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో డైరెక్టర్ ప్రేక్షకులను కట్టి పడేస్తారు. ఓవరాల్ గా చూస్తే విశ్వక్ సేన్ కు దీపావళి కి మరో హిట్ దక్కినట్లే

రేటింగ్ :3-5

Next Story
Share it