నాని వన్ మ్యాన్ షో (HIT3 Movie Review )

నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా పై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఈ సినిమా ఓపెనింగ్ బుకింగ్స్ చెప్పేశాయి. ఈ సినిమాలో వయలెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది అని ...చిన్నపిల్లలు...సున్నిత మనస్కులు ఇటు చూడొద్దు అంటూ కూడా చిత్ర యూనిట్ ముందే ప్రకటించింది. సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమా కు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో లోనూ మహిళలు కూడా పెద్ద ఎత్తున థియేటర్ల లో కనిపించటం విశేషం. దర్శకుడు శైలేష్ కొలను హిట్ థర్డ్ కేసు సినిమా ను నానితో చేస్తున్నట్లు ప్రకటించటంతోనే దీనిపై హైప్ ఒక రేంజ్ కు పెరిగింది. ఒక్కో సినిమాలో ఒక్కో కేసు ను హీరో సాల్వ్ చేసుకుంటూ పోతాడు అనే విషయం తెలిసిందే . అయితే హిట్ 3 లో దేశ వ్యాప్తంగా ఒక సైకో బ్యాచ్ ఒకే స్టైల్ లో దారుణంగా హత్యలు చేస్తూ ఉంటారు. హత్యలు చేయటమే కాకుండా ఈ హత్యలు చేసిన మోడల్ అంతా కూడా నెట్ లో పెడతారు. అయితే ఇది బయట ప్రపంచానికి కనపడకుండా డార్క్ వెబ్ లో ఉంచుతారు. ఇందులో చేరాలనుకునే వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పిన స్టైల్ లో రెండు హత్యలు చేస్తేనే అందులో మెంబర్ షిప్ వస్తుంది . మరి పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ పాత్ర పోషించిన నాని అందులో ఎలా చేరతాడు ...ఈ టీం అట ఎలా కట్టించాడు అన్నదే హిట్ 3 థర్డ్ కేసు మూవీ.
ఈ సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు హీరో నాని ఒంటి చేత్తో సినిమాను నడిపించాడు అనే చెప్పాలి. గత సినిమా లకు భిన్నంగా పోలీస్ అధికారిగా స్టైలిష్ లుక్ లో నాని ఆకట్టుకున్నాడు. సైకో కిల్లర్స్ ను మించి సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నాని తన నటనతో అదరగొట్టాడు. సినిమా సీరియస్ గా సాగినా కూడా ఎక్కడా ప్రేక్షకులకు మాత్రం బోర్ కొట్టదు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నాని ల లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఏదో ఒక రోల్ ఉండాలి కాబట్టి పెట్టినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో వయలెన్స్ పీక్ కు వెళుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇది ప్రేక్షకులను భయపెడుతుంది అనే చెప్పొచ్చు . ఈ సినిమాలో పోలీస్ అధికారిగా రావు రమేష్, నాని తండ్రిగా సముద్రఖని నటించారు. క్లైమాక్స్ లో అడవి శేష్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను కథాకథనాలకు అనుగుణంగా తెరకెక్కించారు. హిట్ 3 లో హై లైట్స్ అంటే నాని యాక్షన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. ప్రతి సినిమా తరహాలోనే హిట్ 3 లో కూడా నెక్స్ట్ సినిమా ఎవరితోనే చెప్పేసారు. హిట్ 4 మూవీ హీరో కార్తీ తో తెరకెక్కించనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే హిట్ 3 మూవీ మాత్రం క్రైమ్ థ్రిల్లర్, సైకో థ్రిల్లర్ మూవీ లను ప్రేమించే వాళ్లకు మాత్రమే.
రేటింగ్: 3 .25 /5