'నాంది' మూవీ రివ్యూ
'ఆవేశం సమస్యని సృష్టిస్తుంది.. ఆలోచన దాన్నిపరిష్కరిస్తుంది', 'దేవుడు.. మంటలు ఆర్పడానికి నీళ్లు ఇస్తే.. గుండె మంటల్ని ఆర్పడానికి కనీళ్లు ఇచ్చాడు' లాంటి డైలాగ్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ప్రీక్లైమాక్స్ లోని కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. 'నాంది' సినిమా అల్లరి నరేశ్ సిని కెరీర్ లో ఓ కీలకమైలుగా నిలుస్తుంది.అంతే కాదు..నరేష్ లో కొత్త నటుడిని పరిచయం చేసిన సినిమాగా ఇది నిలుస్తుంది. శ్రీచరణ్ పాకాల తన రీరికార్డింగ్‌తో సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాలో నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంది. 'నాంది'లో అల్లరి నరేశ్ నగ్నంగా నటించడం, సీరియస్ రోల్ పోషించడంతో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేపింది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే బండి సూర్యప్రకాశ్ అలియాస్ సూర్య( అల్లరి నరేశ్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తల్లిదండ్రులు అతనికి అంటే ఎనలేని ప్రేమ. తన చదువు కోసం తల్లిదండ్రులు ఎలాంటి సుఖాలను వదులుసుకున్నారో.. ఉద్యోగం వచ్చాక వాటన్నింటినితిరిగి ఇస్తాడు. ఇక కొడుకుకు ఉద్యోగం రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అమ్మాయిని కూడా చూస్తారు.
ఇలా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సూర్యప్రకాశ్ అనుకోకుండా పౌరహక్కుల నేత రాజగోపాల్ హత్యకేసులో అరెస్ట్ అవుతాడు. సూర్యని బాగా ఇబ్బంది పెడతాడు ఏసీపీ కిషోర్. కేసుల మీద కేసులు పెట్టి ఐదేళ్ల పాటు సూర్యని బయటకు రాకుండా చేస్తాడు. ఈ క్రమంలో జూనియర్ లాయర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) ఈ కేసును టేకప్ చేసి సూర్యని నిర్థోషిగా బయటకు తీసుకువస్తుంది. బయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయంపై ఏరకంగా పోరాడాడు? అసలు పౌరహక్కుల నేతను ఎవరు,ఎందుకు చంపారు? ఈ కేసులో సూర్యని ఏసీపీ కిషోర్ ఎందుకు ఇరికించాడు? జైలులో ఉన్న సూర్యకి, లాయర్ ఆద్య మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యకు జరిగిన అన్యాయంపై లాయర్ ఆద్య ఏరకంగా పోరాటం చేసిందనేదే 'నాంది' సినిమా. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాకు ఓ పిల్లర్ గా నిలిచారు అని చెప్పొచ్చు. ఏసీపీ కిషోర్ అనే నెగెటివ్ పాత్రలో హరీష్ ఉత్తమన్ మెప్పించారు. ప్రవీన్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్, వినయ్ వర్మ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ కు నాంది సినిమాతో హిట్ దక్కింది.
రేటింగ్. 3.25/5