Telugu Gateway
Movie reviews

'కేజీయఫ్ 2' మూవీ రివ్యూ

కేజీయఫ్ 2 మూవీ రివ్యూ
X

అదిరిపోయే డైలాగ్ లు. క‌ళ్లు చెదిరే యాక్షన్ సీన్స్. సినిమా ఆసాంతం జోష్ తెచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్. అన్ని క‌లిపితే కెజీఎఫ్‌2. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వ‌ర‌కూ హీరో ఎలివేష‌న్ ఒక రేంజ్ లో ఉంటుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కెజీఎఫ్ తొలి భాగంతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డంతో రెండ‌వ భాగం కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్లు క‌న్పించింది. ఆ ప్ర‌య‌త్నంలో ఆయ‌న విజ‌యం సాధించారు. ర‌క్తంతో రాసిన క‌థ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ళ‌లేం. ముందుకెళ్ళాలంటే మ‌ళ్ళీ ర‌క్తాన్నే అడుగుతుంది అనే డైలాగ్ ట్రైల‌ర్ లోనే చూశాం. అలాగే కేజీఎప్ మొదటి భాగం ముగిసిన చోట నుండి రెండో అధ్యాయం ప్రారంభం అయింది. రాఖీ (యశ్) కేజిఎఫ్ ను సొంతం చేసుకున్న తర్వాత త‌న‌కంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. కోలార్ గ‌నుల్లోనే కాకుండా ఒక నియంత‌గా తనదైన అధిప‌త్యాన్ని గుర్తింపును తెచ్చుకున్న రాఖీ పై ప్రధాన మంత్రి రమికాసేన్ (రవీనా టాండ‌న్‌) దగ్గర నుంచి కెజీఎఫ్ ను చేజిక్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నించే అధిరా (సంజ‌య్ ద‌త్) వరకూ రాఖీ పై దాడి చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారందర్నీ తన ఎత్తులతో చిత్తు చేస్తాడు రాఖీ. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఢీకొట్టిన రాఖీ క‌థ ఎలా ముగుస్తుంది అన్న‌దే కెజీఎఫ్ 2 మూవీ. ఈ సినిమాలో హీరో య‌శ్ (రాఖీ) క్యారెక్ట‌ర్ గురించి చెబుతూ ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్క‌డ రెండు గ్రావిటీలు ఉంటాయి. న్యూటన్ గ్రావిటి ప్ర‌కారం యాపిల్ పై నుంచి కింద ప‌డుతుంది.

రాఖీ గ్రావిటి ప్ర‌కారం మ‌నుషులు కింద నుంచి పైకిపోతారు అంటాడు. తొలి భాగంలో కెజీఎఫ్ చ‌రిత్ర‌ను అనంత్ నాగ్ చెప్ప‌గా..రెండ‌వ భాగంలో ఈ బాధ్య‌త ప్ర‌కాష్ రాజ్ కు అప్ప‌గించారు. ఈ క‌థ గురించి చెప్ప‌టంలో ప్ర‌కాష్ రాజ్ మంచి టెంపో మెయింటైన్ చేశారు. ఎప్ప‌టిలాగానే య‌శ్ త‌న సెటిల్డ్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. విదేశాల‌కు వెళ్ళి త‌న గ‌నుల్లోకి రాఖీ రీ ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో, ఒక బంగారు బిస్కెట్ ను పోలీసులు తీసుకెళ్లిన స‌మ‌యంలో వ‌చ్చిన యాక్షన్ స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. భారీ హంగామాతో సెట్టింగ్ లు వేసి సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లార‌ని చెప్పొచ్చు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ తో యశ్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. `కేజీఎఫ్ 2′తో ఆయ‌న రేంజ్ మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి. హీరోయిన్ శ్రీనిధి పాత్ర ప‌రిధి చిన్న‌దే అయినా ఉన్నంత‌లో ఆక‌ట్టుకుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. విల‌న్ గా సంజ‌య్ ద‌త్ త‌న న‌ట‌న‌తో ఆకట్టుకుంటాడు. ప్రధానిగా న‌టించిన ర‌వీనా టాండ‌న్ కూడా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది. ఒవ‌రాల్ గా చూస్తే యాక్షన్ ప్రేమికుల‌కు కెజీఎఫ్ 2 ఓ పండ‌గ‌లాంటి మూవీ.

రేటింగ్. 3.25-5

క్ష

Next Story
Share it