'కపటధారి' మూవీ రివ్యూ
ఒక ఫ్యామిలీ మర్డర్ ను చేధించే సినిమా రెండు గంటలకు పైగా నడపటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఓ ట్రాఫిక్ ఎస్ఐ..క్రైమ్ స్టోరీని చేధించటం. ట్రాఫిక్ నుంచి క్రైమ్ విభాగానికి మారాలనే పట్టుదలతో ఉండే ఎస్ఐ చేసే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవు. కానీ మెట్రో పనుల సాగుతున్న సమయంలో జరిగిన తవ్వకాల్లో కొన్ని పుర్రెలు బయటపడతాయి. అప్పటి నుంచి ట్రాఫిక్ విధులను పక్కన పెట్టి..వీటిపై ఫోకస్ పెడతాడు హీరో. పై అధికారుల సహకారం లేకపోయినా ఈ కేసును చేధించే ప్రయత్నమే 'కపటధారి' సినిమా. ఈ కేసు ను చేధించేందుకు హీరో పదవి విరమణ చేసిన పోలీసు అధికారి, జర్నలిస్ట్ సాయంతో ముందుకు సాగుతాడు. వీరితో స్టోరీ చెప్పించిన విధానం బాగానే ఉన్నా స్లో నేరేషన్ తో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. అయితే క్రైమ్ థ్రిల్లర్ లో ఉండే ట్విస్ట్ లు కథలో ఉన్నా..స్టోరీని గ్రిప్పింగ్ గా ప్రజంట్ చేయటంలో దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తడబడ్డాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన కవలుదారి సినిమాకు రీమేకే ఈ కపటథారి.
అయితే అక్కడ హిట్ అయిన సినిమాను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో విఫలమయ్యారు. సుమంత్ కొత్త సినిమాతో వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు రీమేక్ ను నమ్ముకున్నా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోవటంలో విఫలయయ్యాడు. ఈ మర్డర్ కేసు విచారణలో ఆలేరు శ్రీనివాస్ అనే మరోవ్యక్తి పేరు బయటకు వస్తుంది. అసలు ఈ ఆలేరు శ్రీనివాస్ ఎవరు? అతనికి ఈ కేసుకు ఏం సంబంధం? అన్నదే సినిమా. సినిమా అంతా హీరో సుమంత్ ఒకే మూడ్ లో కన్పిస్తాడు. ఇతర కీలక పాత్రలు పోషించిన నాజర్, జర్నలిస్ట్ పాత్రలో కన్పించిన జయప్రకాష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ నందిత కు ఈ సినిమాలో చాలా పరిమిత పాత్రే. ఓవరాల్ గా చూస్తే కపటథారి ఏ మాత్రం ఫీల్ ఇవ్వని క్రైమ్ థ్రిల్లర్ గా మిగిలిపోతుంది.
రేటింగ్. 2.25/5