ట్రోలింగ్ లు దాటుకుని...!(Kannappa Movie Rview)

ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి భారీ తారాగణం ఉండటంతో కన్నప్ప సినిమాపై హైప్ ఒక రేంజ్ కు వెళ్ళింది. మరో వైపు మంచు విష్ణు చేసిన మొదటి పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. కన్నప్ప సినిమాలో ఉన్న టాప్ స్టార్లు ఒక వైపు...మరో వైపు ముఖ్యంగా సోషల్ మీడియా లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పై భారీ ఎత్తున సాగుతున్న ట్రోలింగ్స్ మరో వైపు. ఈ ట్రోలింగ్ కి ప్రధాన కారణం వాళ్ళు చేసిన కామెంట్స్ అనే చెప్పాలి. ఈ విషయం కాసేపు పక్కన పెడితే భారీ బడ్జెట్ తో తెరక్కించిన ఈ కన్నప్ప మూవీ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ అంతా కూడా ఐదు గిరిజన గ్రామాలు, వాయు లింగం చుట్టూనే తిరుగుతుంది. ఎంతో మహిమ ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ఒక గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఐదు గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఒక్కో రాజు ఉంటాడు. అందరూ కలిస్తే తప్ప వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించే వాళ్ళను అడ్డుకోవటం సాధ్యం కాదు నిర్ణయించుకుని ...ఈ బాధ్యతను మంచు విష్ణు (తిన్నడికి) అప్పగిస్తారు.
చిన్నప్పటి నుంచి తిన్నడికి దేవుడు అంటే ఏ మాత్రం నమ్మకం ఉండదు. శివుడిని కూడా రాయి అంటూ దేవుడిని పూజించే వాళ్ళతో నిత్యం వాదనలకు దిగుతుంటాడు. తిన్నడి గ్రామంలోనే అమ్మవారిని శాంతిప చేయటానికి . మనుషులను బలి ఇవ్వటం ఆచారం. ఒక సారి తన స్నేహితుడిని బలి ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంటే దీన్ని తిన్నడు అడ్డుకుంటాడు. దీంతో తిన్నడి తండ్రి శరత్ కుమార్ అతన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తాడు. మొదటి నుంచి అసలు ఏ మాత్రం దేవుడిని నమ్మని తిన్నడు చివరకి శివుడి భక్తుడిగా మారి ఏకంగా దేవుడికి తన రెండు కళ్ళు ఎందుకు ఇచ్చేలా ఎలా మారిపోయాడు అన్నదే కన్నప్ప మూవీ. ఈ సినిమా పై మోహన్ లాల్, ప్రభాస్ చాలా పెద్ద ప్రభావం చూపించారు అనే చెప్పాలి. మోహన్ లాల్ ఉందేది కొద్దిసేపే అయినా అయన ఎంట్రీ సమయంలో ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మోహన్ లాల్, మంచు విష్ణుల మధ్య ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే ప్రభాస్ విషయంలో కూడా. ప్రభాస్, మంచు విష్ణుల మధ్య వచ్చే డైలాగులు కూడా మంచి ప్రభావం చూపించాయి.
కన్నప్ప సినిమా కు ప్రభాస్ అదనపు ఆకర్షణగా నిలిచాడు అనే చెప్పొచ్చు. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన అంటే శివ పార్వతులలాగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లు కూడా మెప్పించారు. వాయులింగం దగ్గర మోహన్ బాబు, మంచు విష్ణు మధ్య వచ్చే డైలాగులు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. కన్నప్ప సినిమాలో ఎక్కువ భాగం దేవుడిని ఏ మాత్రం నమ్మని పాత్రలో ..క్లైమాక్స్ లో శివుడి కోసం కళ్ళు పీకి ఇచ్చే రోల్ లో మంచు విష్ణు మంచి వేరియేషన్స్ చూపించాడు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ ప్రీతీ ముకుందన్ అక్కట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో..పాటల్లోని రొమాంటిక్ సన్నివేశాలు ఒకింత డోస్ పెంచినట్లు ఉంది అనే చెప్పాలి. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా చూస్తే కన్నప్ప సినిమా ప్రేక్షకులను నచ్చుతుంది అనే చెప్పొచ్చు. సినిమాలోని లొకేషన్స్ కూడా ఫీల్ గుడ్ వైబ్రేషన్స్ తెప్పిస్తాయి. మరో వైపు ఈ సినిమా తో మంచు విష్ణు కు హిట్ దక్కింది అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా ఉన్నా ఓవర్ అల్ గా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే చెప్పొచ్చు. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమా ను ట్రాక్ తప్పకుండా తెరకెక్కించడంలో విజయం సాధించారు.
రేటింగ్: 3 .25 -5