Telugu Gateway
Movie reviews

హిట్ ది సెకండ్ కేసు మూవీ రివ్యూ

హిట్ ది సెకండ్ కేసు మూవీ రివ్యూ
X

హీరో నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై వరసగా హిట్ ఫస్ట్ కేసు...సెకండ్ కేసు పేరుతో సినిమా లు తెచ్చారు. . హిట్ ఫస్ట్ కేసు లో హీరో విశ్వక్ సేన్ అయితే..హిట్ ది సెకండ్ కేసు సినిమాను అడివి శేష్ హీరోగా తెరకెక్కించారు. ఇవన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. దర్శకుడు శైలేష్ కోలన్ ఈ సినిమాకు కూడా తెరకెక్కించారు. హిట్ ఫస్ట్ పార్ట్ దర్శకత్వం కూడా ఆయనదే అన్న విషయం తెలిసిందే. ఒక సిరీస్ గా ఈ సినిమాలు తీసుకొస్తున్నట్లు ముందే తెలిపారు. ఇక హిట్ ది సెకండ్ కేసు విషయానికి వస్తే ఈ సినిమా లో అడివి శేషు కు జోడిగా మీనాక్షి చౌదరి నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్..క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలకు అందకుండా సాగితేనే అవి ఆకట్టుకుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అది అంత పక్కాగా ఉన్నట్లు అనిపించదు. విశాఖ సిటీలో అమ్మాయిలు దారుణంగా హత్యకు గురి అవుతుంటారు. ఆ హత్యలు ఎంత భయంకరంగా ఉంటాయంటే తల, కాళ్ళు, చేతులు కూడా నరికి వేస్తారు. ఒక మహిళా సంఘంలో ఉన్న వాళ్లే ఇలా వరస హత్యలకు గురవుతూ ఉంటారు. అసలు ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు..దీని వెనక ఉన్న కారణం ఏమిటి అన్న పనిలో హిట్ టీం పనిచేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో ఒక నిరపరాధి పై కేసు తోసి వేస్తారు. ఈ అవమానం తో అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి వైజాగ్ లో అమ్మాయిలను దారుణంగా హత్యలు చేసింది ఎవరు ... తన తండ్రిని మోసం చేసిన తల్లి పై ఆమె కొడుకు కసి పెంచుకుని సైకో లా ఎందుకు మారాడు అన్నది సినిమా చూడాల్సిందే. ఒక హత్య కేసులో నిందుతుడిని వెంటనే పట్టుకున్న క్రమంలో అడివి శేష్ వాడిని కోడి బుర్ర డైలాగు సినిమా లో ఆసక్తికర మలుపులకు కారణం అవుతుంది. సిట్ అధికారిiగా అడివి శేషు కు ఇది చాలా అలవాటు అయిన పాత్ర కావటం తో అయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. పోలీస్ అధికారిగా ఈ హత్యల మిస్టరీ ఛేదించే బాధ్యతలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. ఇతర కీలక పాత్రలు పోషించిన రావు రమేష్ తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఓవరాల్గా చూస్తే హిట్ ది సెకండ్ కేసు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. హిట్ థర్డ్ కేసు మూవీ నిర్మాత, హీరో నాని తోనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని హిట్ సెకండ్ కేసు చివరలో చెప్పేశారు.

రేటింగ్: 2 .75

Next Story
Share it