గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ
![గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ గుర్తుందా శీతాకాలం మూవీ రివ్యూ](https://telugugateway.com/h-upload/2022/12/09/1627489-gurthunda-seethakalam-review-in-telugu.webp)
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన గుర్తుందా శీతాకాలం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోగా నటించిన సత్యదేవ్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో కలసి గాడ్ ఫాదర్ లో నటించటం, అందులో సత్యదేవ్ పాత్రకు మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గుర్తుందా శీతాకాలం సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయని చెప్పాలి. హీరో సత్యదేవ్ విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రతేక్య గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ సినిమా లవ్ మాక్ టైల్ కు రీమేక్ ఈ సినిమా. ఇది కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయింది సత్యదేవ్ తెలుగులో ఈ తరహా లవ్ స్టోరీ సినిమా చేయటం కూడా బహుశా ఇదే మొదటిసారి. అందులోనూ ఈ సినిమాలో హీరో కు ముగ్గురు లవర్స్. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఇందులో స్కూల్ రోజుల ప్రేమకథలు, తర్వాత యంగ్ ఏజ్ ప్రేమకథలుగా చెప్పుకోవాలి. ఇది గతంలో చాలా సినిమాల్లో చూసిన కథే. పేరుకు ఇందులో మూడు ప్రేమ కథలు అని చెప్పిన మేఘా ఆకాష్ ను మాత్రం హీరో గతం మొత్తం చెప్పటానికి మాత్రమే సినిమాలో చూపించారు.
మిగిలిన ఇద్దరిలో ఒకరు తమన్నా అయితే, మరొకరు కావ్య శెట్టి కనిపిస్తారు. ఫస్ట్ లవ్ బ్రేక్ అప్ అయిన తరవాత సత్యదేవ్ తమన్నా కు ప్రపోస్ చేసి పెళ్లిచేసుకుంటారు. మరి ఫస్ట్ లవ్ ఎందుకు ఫెయిల్ అయింది..అంతకు ముందు స్కూల్ డేస్ లో సాగిన ప్రేమకథలు ఏమిటో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. లవర్ బాయ్ గా సత్యదేవ్ రకరకాల వేరియేషన్స్, ఎమోషనల్ సీన్స్ లోనూ సత్యదేవ్ తన మార్క్ చూపించారు. . సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, క్లయిమాక్స్ తో భారమైన హృదయంతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వస్తారు. ఈ సినిమా లో నటనకు అవకాశం ఉన్నది ఒక్క సత్యదేవ్ కు మాత్రమే అని చెప్పొచ్చు. తమన్నా సీనియర్ హీరోయిన్ కావటం తో ఆమె ఈ పాత్ర చేయటం పెద్ద కష్టమేమి కాదు..కాకపోతే గ్లామర్ పాత్రలు చేసే తమన్నా ఈ పాత్ర ఒప్పుకోవటం గ్రేట్ అనే చెప్పొచ్చు. మొత్తంమీద గుర్తుందా శీతాకాలం సినిమా సత్యదేవ్ ను ఒక కొత్త పాత్రలో చూపించింది.
రేటింగ్ :2 .75 / 5