Telugu Gateway
Movie reviews

నితిన్ నమ్మకం నిజం అయిందా?!

నితిన్ నమ్మకం నిజం అయిందా?!
X

హీరో నితిన్ గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. చేసిన సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సో సో గా ఆడుతున్నాయి తప్ప...హిట్ దక్కటం లేదు. ఈ తరుణంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నితిన్. ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది అనే చెప్పాలి. మరో వైపు టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథలు అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించటంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. అయన దర్శకుడిగా తెరకెక్కించిన రెండవ సినిమా ఇది.గతంలో అల్లు అర్జున్ హీరో గా నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా సినిమాను తెరకెక్కించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇప్పుడు నితిన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కథ కంటే ప్రేక్షకులను నవ్వించాలి..ఫుల్ ఎంటర్ టైన్ చేయటమే లక్ష్యంగా ఈ సినిమా నిర్మించారు అనే చెప్పాలి. హీరో నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్. ఎలాగైనా సినిమాల్లో నటించాలనే లక్ష్యంతో ఉంటాడు. ఇది వర్క్ అవుట్ కావటం లేదు అని మధ్యలో ఒక ఉద్యోగంలో చేరతాడు. అనతికాలంలోనే ఒక కంపెనీ సీఈఓ అవుతాడు. అలా సీఈఓ అయిన కొద్దిరోజులకే పాత ఫ్రెండ్ ఒకరు వచ్చిన అద్భుతమైన కథ ఉంది..నువ్వే హీరో అని చెపుతాడు. దాన్ని నమ్మి ఉన్న సీఈఓ ఉద్యోగం కూడా మానేస్తాడు. కానీ తర్వాత ఆ సినిమాలో హీరో ఛాన్స్ కూడా దక్కదు. కానీ తాను హీరోగా తెరకెక్కించ ప్రతిపాదించిన కథ ప్రకారమే హీరో జీవితం ముందుకు సాగుతుంది.

ఆ స్క్రిప్ట్ ప్రకారమే పని చేసుకుంటూ పోతాడు. ఉన్న సీఈఓ ఉద్యోగం వదులుకుని...అటు సినిమా ఛాన్స్ దక్కని జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న హీరో తో కథ అంతా ఎలా సాగింది అన్నదే ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా. హీరో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో పర్ఫెక్ట్ గా చేసి ఫుల్ ఎంటర్ టైన్ చేసాడనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో నితిన్ తల్లితందులుగా రావు రమేష్...రోహిణి నటించారు. నితిన్ పలు ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ సినిమాలో హై లైట్ అంటే నితిన్, రావు రమేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలే. నిజంగా రావు రమేష్ నటన అల్టిమేట్ అని చెప్పాలి. రోహిణి కూడా తనదైన యాక్షన్ తో ప్రేక్షకులను నవ్విస్తుంది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీ లీల ల లవ్ ట్రాక్ పెద్ద ఆకట్టుకునేలా ఉండదు. హీరోయిన్ శ్రీ లీలకు ఈ సినిమాలో పెద్ద గా స్క్రీన్ స్పేస్ కూడా దక్కలేదు. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి సందడి చేస్తారు. ఈ సినిమాలో అటు పవిత్ర లోకేష్, ఇటు పృద్వి నిజ జీవితంలో జరిగిన సంఘటనలపై కూడా డైలాగులు పెట్టి నవ్వించారు. లాజిక్ లు వెతక్కుండా ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. హీరో నితిన్ తన ఎనర్జిటిక్ యాక్షన్స్ తో చాలా రోజుల తర్వాత హిట్ దక్కించుకున్నాడు.

రేటింగ్ :3 /5

Next Story
Share it