Telugu Gateway
Movie reviews

రవి తేజ కు హిట్ దక్కిందా?(Eagle Movie Review)

రవి తేజ కు హిట్ దక్కిందా?(Eagle Movie Review)
X

సంక్రాంతి బరిలో నిలవాల్సిన రవితేజ ఈగల్ సినిమా రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకే సారి ఐదు సినిమాలు వస్తే థియేటర్ల సమస్య తో పాటు కలెక్షన్ల పై ప్రభావం పడుతుంది అని వెనక్కి తగ్గారు. ఇప్పుడు సోలోగా ఈ శుక్రవారం నాడు ఈగల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదల అయిన రవి తేజ గత సినిమా టైగర్ నాగేశ్వర్ రావు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో రవి తేజ ఫ్యాన్స్ ఈగల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా కథ అంతా గన్స్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ప్రారంభంలో చిత్తూర్ జిల్లాలోని తలకోన అటవీ ప్రాంతంలో పండే ప్రత్యేక పత్తి..దీన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ఈగల్ కు లింక్ పెట్టి కథ ప్రారంభం కావటంతో ప్రేక్షకులు అంతా ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటారు. అలా అనుకున్నంత సేపు పట్టదు కథ మళ్ళీ బాక్సైట్ గనుల వైపు వెళుతుంది. తర్వాత సినిమా అంతా ఆయుధాల చుట్టూనే తిరుగుతుంది. ఆయుధాలు అర్హుల చేతిలో కాకుండా...అనర్హుల చేతిలో పడితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది అనే సందేశంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈగల్ సినిమాలో రవి తేజ న్యూ లుక్ లో కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కథ విషయంలో కాస్త గందర గోళంలో ఉన్నట్లు కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో క్లారిటీ వస్తుంది. ఈగల్ సినిమా లో ప్రేక్షకులకు క్లైమాక్స్ లో వచ్చే జీప్ ఫైట్ తో పాటు...అమ్మవారి విగ్రహం సీన్ తో వచ్చే ఫైట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. అయితే ఈగల్ సినిమా చూసిన ప్రేక్షకులకు అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నదా అన్న సందేహం రాక మానదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో కొంత భాగం అయిన తర్వాత కానీ హీరోయిన్ కావ్య థాపర్ కనిపించదు. రవి తేజ, హీరోయిన్ కావ్య థాపర్ లవ్ ట్రాక్ సైతం అంతగా ఆకట్టుకోదు. అనుపమ పరమేశ్వరన్ ఈగల్ గురించి తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో నవదీప్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కున ఉన్న పాత్ర దొరికింది అని చెప్పొచ్చు. అమెరికాలో నిత్యం జరిగే కాల్పుల ఘటనల స్పూర్తితో దర్శకుడు ఈ కథ రాసుకున్నట్లు కనిపిస్తుంది. నిర్మాతలు మాత్రం ఖర్చులో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమా ను చాలా రిచ్ గా తెరకెక్కించారు. ఈగల్ సినిమా చివరిలో దీనికి రెండవ భాగం కూడా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ఈగల్ మరో రొటీన్ మూవీగా మిగలనుంది అనే చెప్పాలి.

Rating : 2.5 -5

Next Story
Share it