షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ విజయం
పేదలకు, చదువురాని వాళ్లకు పలు దేశాలు వీసా ను నిరాకరిస్తున్నాయి అని...దీంతో చాలా మంది అక్రమమార్గాల్లో విదేశాలకు వెళ్లి మంచి జీవితం గడపాలి అనే ప్రయత్నంలో విఫలం అయి ఎంతో మంది చనిపోతున్న విషయాన్ని దర్శకుడు ఇందులో చూపించారు. ఇంగ్లాండ్ వీసా ఇంటర్వ్యూ కు హాజరు అయ్యేందుకు షారుఖ్ ఖాన్ అండ్ టీం బోమన్ ఇరానీ దగ్గర ఇంగ్లీష్ శిక్షణ తీసుకుంటారు. ఇక్కడ ఉండే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అనటంలో సందేహం లేదు. సినిమాకు హై లైట్ ఈ ఇంగ్లీష్ శిక్షణా క్లాసులు... ఒక్కో అంశంపై రెండు నిమిషాల్లో ఇంగ్లీష్ లో మాట్లాడం వంటి అంశాలు. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఈ కామెడీ అల్టిమేట్ అయితే...సెకండ్ హాఫ్ లో ఎలా వీళ్ళు పంజాబ్ నుంచి అక్రమంగా ఇంగ్లాండ్ లోకి ప్రవేశించారు అన్నది చూపించారు. ఒక వైపు కామెడీ, మరో వైపు భావోద్వేగ సన్నివేశాలతో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాను పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, తాప్సి లు కథకు అనుగుణంగా కనిపించి ఆకట్టుకున్నారు. విక్కీ కౌషల్ ఈ సినిమాలో కనిపించేది తక్కువ సమయం అయినా మంచి పాత్ర దక్కింది. డుంకి సినిమాతో షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది హ్యాట్రిక్ విజయం సాధించినట్లు అయింది. అయితే ఈ సినిమా వసూళ్లు సలార్ పోటీని తట్టుకుని షారుఖ్ గత రెండు సినిమా ల తరహాలో వెయ్యి కోట్ల మార్క్ ను చేరుకుంటుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. అయితే సలార్ కంటే ఒక రోజు ముందు వచ్చి షారుఖ్ ఖాన్ మంచి హిట్ దక్కించుకున్నాడు అనే చెప్పాలి.
రేటింగ్: 3.5 /5