Telugu Gateway
Movie reviews

నాని పాన్ ఇండియా ప్రయత్నం ఫలించిందా?!

నాని పాన్ ఇండియా ప్రయత్నం ఫలించిందా?!
X

శ్రీరామనవమి రోజున దసరా పేరుతో సినిమా విడుదల కావటమే ఒక వెరైటీ. అందులో ఇది నాని తొలి పాన్ ఇండియా సినిమా. అంటే సుందరానికి తర్వాత నాని చేసిన సినిమా ఇదే కావటం...దీనిపై నాని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవటంతో అందరి కళ్ళు దీనిపైనే ఉన్నాయి. అదే సమయంలో దసరా పాటలు కూడా సినిమాపై అంచనాలు పెంచటంలో విజయవంతం అయ్యాయి. సరైన కథ ఉండాలి కానీ నటనలో తమ సత్తా చూపగల వాళ్ళు హీరో నాని. హీరోయిన్ కీర్తి సురేష్. ఈ దసరా సినిమా కథ అంతా వీర్లపల్లి అనే ఊరు చుట్టూనే తిరుగుతుంది. వీర్లపల్లి ఊరు ...అక్కడ ఉండే సిల్క్ బార్, ఆ ఊరి రాజకీయాలకు, బార్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? బొగ్గు దొంగతనాలు చేస్తూ ఉండే నాని (ధరణి), దీక్షిత్ శెట్టి (సూరి) ల స్నేహం చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ల మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పటికే చాలా సినిమాల్లో ప్రేక్షకులు చూసి చూసి ఉన్నదే.

సినిమాలో కాస్త నవ్వు తెప్పించిన సంఘటన ఏమైనా ఉంది అంటే...ఎన్టీఆర్ మధ్య నిషేధం విధించిన సమయంలో ఆ గ్రామ ప్రజలు పడిన అవస్థలే. పరాయి స్త్రీ పై కన్నేస్తే పది తలల రావణుడు ఒక తల ఉన్న వాడి చేతిలో చనిపోయాడు అనే పవర్ ఫుల్ డైలాగు సినిమాలో హై లైట్. సినిమాలో హై లైట్స్ అంటే హీరో నాని, కీర్తి సురేష్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. పాటలు. పెళ్లి టైం లో కీర్తి సురేష్ డాన్స్ కేక అనే చెప్పాలి . సినిమా కథ లో ప్రచారం చేసుకున్నంత దమ్ము లేకపోవటం మైనస్ గా చెప్పాలి. ఈ సినిమాకు కథ అందించి, దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెల తొలి ప్రయత్నం జస్ట్ ఓకే గా నే ఉంది కానీ...కేక అని చెప్పలేము. హీరో నాని తొలిసారి ఊరమాస్ పాత్రలో అదరగొట్టాడు. డీ గ్లామర్ పాత్రలో కీర్తి సురేష్ మరో సారి తన సత్తా చాటింది. కథలో బలం లేకపోవటం వల్ల వీరి యాక్షన్, ఆకట్టుకున్న పాటలు సినిమాను విజయతీరాలకు తీసుకెళ్లలేక పోయాయి. ఈ దసరా మూవీ నాని ఫాన్స్ కు మాత్రమే పండగ సినిమా.

రేటింగ్:2 .25 - 5

Next Story
Share it