Telugu Gateway
Movie reviews

'బుట్టబొమ్మ' మూవీ రివ్యూ

బుట్టబొమ్మ మూవీ రివ్యూ
X

కొన్ని సినిమాలు బ్యానర్ ను బట్టి కూడా చూస్తారు. ఎందుకంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ గతంలో తీసిన సినిమాలు కూడా ఒక అంచనాకు రావటానికి ఉపయోగ పడతాయి. అలాంటిదే బుట్ట బొమ్మ సినిమా కూడా. ఎందుకంటే ఇందులో స్టార్ లు లేరు కాబట్టి. సినిమా టైటిల్..టీజర్ ...ట్రైలర్ ఈ సినిమాపై ఒకింత అంచనాలను పెంచాయనే చెప్పాలి. మళయాళం సినిమా కప్పెలా కు రీమేక్ ఈ బుట్టబొమ్మ సినిమా. ఈ సినిమా లో అనిఖా సురేంద్రన్‌, సూర్య వశిష్ట, అర్జున్‌ దాస్‌ లు ప్రధాన పాత్రలు పోషించారు. శౌరి చంద్రశేఖర్‌ రమేశ్‌ దర్శకుడు. ఇది ఒక పల్లెటూరి అమ్మాయి ప్రేమకథ ఒక సారి పొరపాటున చేసిన ఫోన్ ఈ ప్రేమకు బీజం వేస్తుంది. అందుకు కారణం ఆ అమ్మాయి గొంతు. అసలు ఎవరు ఎలా ఉంటారో చేసుకోకుండానే వీళ్ళు ప్రేమలో పడతారు. హీరో సూర్య వశిష్ట, అనిఖా సురేంద్రన్‌ లు తొలి సారి వైజాగ్ లో కలుకుందాం అని నిర్ణయం తీసుకుంటారు. మరి వైజాగ్ వచ్చాక హీరోయిన్ కు తెలిసిన నిజాలు ఏంటి...వైజాగ్ లోని బస్ స్టాండ్ లో కలిసిన మరో హీరో అర్జున్ దాస్ ఆమెను ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమా. ఇక సినిమా అంతా అనిఖా సురేంద్రన్‌ చుట్టూనే తిరుగుతుంది.

నాగార్జున హీరోగా చేసిన ది గోస్ట్ మూవీ లో ఫుల్ స్పీడ్ ఉండే అమ్మాయిగా కనిపించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో మాత్రం అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరో సూర్య వశిష్ట్ ఆటో డ్రైవర్ గా ఉంటూ అందరితో మంచివాడు అనిపించుకుంటాడు. కానీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షుకుల అంచనాకు అందదు. అదే టైం లో నెగిటివ్ షేడ్స్ తో కనిపించే అర్జున్ దాస్ రోల్ కూడా క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. బీచ్ అంటే ఎంతో ఇష్టపడే హీరోయిన్ కు అర్జున్ దాస్ అక్కడ తీసుకునే క్లాస్ ఆలోచింప చేసేలా ఉంటుంది. ఏదో ఫోన్లో మంచిగా మాట్లాడారని ఎవరిని బడితే వాళ్ళను నమ్మొద్దు, ఆలా అని అందరిని అనుమానించాల్సిన అవసరం లేదు...ఈ డిజిటల్ యుగంలో జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో చెప్పారు ఇందులో. మొత్తం మీద చూస్తే గతంలోనే కేవలం ఫోన్లో మాట్లాడి ప్రేమించుకున్న ప్రేమకథలు టాలీవుడ్ లో చాలానే వచ్చాయి. అయితే ఇది అంతా పక్కా గ్రామీణ వాతావరణంతో ఒకింత కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు చంద్రశేఖర్ టి రమేష్. అయితే సినిమా చాలా స్లోగా సాగటం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బుట్ట బొమ్మ అంతగా ఆకట్టుకోలేక పోయింది అమ్మా.

రేటింగ్; 2 .5 / 5

Next Story
Share it