Telugu Gateway
Movie reviews

'బొంభాట్' మూవీ రివ్యూ

బొంభాట్ మూవీ రివ్యూ
X

ఓటీటీల సీజన్ స్టార్ట్ అయ్యాక ఓ చిన్న లైన్..అది పాతది అయినా సరే అందులో ఎంతో కొంత కొత్తదనం నింపి నడిపించేస్తున్నారు. బొంభాట్ సినిమా గురించి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిదంటే పుడుతూనే దురదృష్టాన్ని మోసుకొచ్చే పిల్లలు ఇందులో ఓ కీలక అంశం. ఈ సీన్లు చాలా చాలా సినిమాల్లో చూసినవే. మరొకటి రోబో సినిమాలో చిట్టీకి కూడా మనిషిలాగే ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అన్న తరహాలో ఈ సినిమాలో మాయ (సిమ్రాన్ చౌదరి) ని రోబోగా చూపించటం సేమ్ టూ సేమ్. అయితే బొంభాట్ సినిమాలో ప్రధాన పాత్రదారులైన సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి, ప్రియదర్శి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాఘవేంద్రవర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. క్లైమాక్స్ లో హీరో సాయి సుశాంత్ రెడ్డి చెప్పే డైలాగ్ 'బలవంతుడికి అదృష్టంతో పనిలేదు.. బలహీనుడికి అదృష్టం ఉన్నా పనికిరాదు' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ సినిమా కు వాయిస్ ఓవర్ అందించారు. 'వీడో జన సైనికుడు. వీడికి మార్పు కావాలంట. నల్లపిల్లి కన్నా దరిద్రం అయింది వాడి బతుకు. వీడి ప్లేస్ మారిన ఫేట్ మారలేదు. ఈ గ్రహాన్ని ఇంకో గ్రహం మీద వదిలేసినా తప్చించుకోలేరు. వీడిని చూసినా...ముట్టుకున్నా...అంతే. ' అంటూ ఈ సినిమాలో డైలాగ్ లు సరదగా సాగుతాయి. బట్టర్ ఫ్లై ప్రాజెక్టు చేసే శాస్త్రవేత్తలో ఒకరి కూతురు అయిన మాయను ప్రేమిస్తాడు దాదా. అదే విషయాన్ని మాయ తండ్రితో చెపితే అసలు నీ వయస్సు ఏంటి..నా కూతురు వయస్సు ఏంటి. నువ్వు ప్రేమించటం ఏమిటరా అంటూ ఫైర్ అవుతాడు. పోనీ ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టావో చెప్పరా అంటే..మూగ మనసులు సినిమావచ్చినప్పుడు అని చెబుతాడు. అప్పుడే నాకే ఆరేళ్ళు...నా కూతురుని నువ్వు పెళ్ళి చేసుకోవటం ఏంటిరా? అంటూ దాదాను ప్రశ్నించే సీన్ కామెడీ అదిరిపోతుంది. ఓవరాల్ గా చూస్తే కథ గురించి ఆలోచించకుండా బొంభాట్ ను టైమ్ పాస్ మూవీగా చూసేయోచ్చు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో గురువారం నాడు విడుదల అయింది.

రేటింగ్. 2.5/5

Next Story
Share it