Telugu Gateway
Movie reviews

చిరంజీవికి హ్యాట్రిక్ విజయం దక్కిందా?!

చిరంజీవికి  హ్యాట్రిక్ విజయం దక్కిందా?!
X

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి యువ హీరో ల కంటే దూకుడుగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత వరసగా గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య సినిమాలతో కమర్షియల్ హిట్స్ సాధించారు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు భోళా శంకర్ సినిమాపై ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి కు హ్యాట్రిక్ హిట్ దక్కుతుందా..లేదా అన్నదే దీనిపై అందరికళ్ళు పడటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే చిరంజీవి వరస హిట్స్ కు భోళా శంకర్ సినిమా బ్రేకులు వేసింది. ఈ సినిమాతో మెగాస్టార్ కు హ్యాట్రిక్ విజయం దక్కలేదు అనే చెప్పాలి. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా కు రీమేక్ గానే ఈ భోళా శంకర్ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేసే గ్యాంగ్. దీని వెనక పెద్ద మాఫియా ముఠా. పోలీస్ లకు కూడా చేత కానీ ఈ గ్యాంగ్ ను హీరో మట్టుపెట్టడం అన్నదే ప్రధాన స్టోరీ లైన్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా దీనిమీదే సాగుతుంది. సెకండ్ హాఫ్ లో భోళా శంకర్ అసలు పాత్ర చూపిస్తారు. చిరంజీవి ఓ కిరాయి గుండాగా . డబ్బులు ఇస్తే చాలు ఎవరి పని అయినా..ఏ పని అయినా చేసి పెడుతుంటాడు.

ఈ క్రమంలోనే ఒక ఇల్లు ఖాళీ చేయించే కాంట్రాక్టు వస్తుంది. అందులోనే మురళి శర్మ...అయన కూతుర్లు కీర్తి సురేష్, శ్రీముఖి ఉంటారు. మరి ఇల్లు ఖాళీ చేయించటానికి వచ్చిన భోళా శంకర్ కు కీర్తి సురేష్ చెల్లిగా ఎలా మారుతుంది. మరి అమ్మాయిలను విక్రయించే ముఠాను క్యాబ్ డ్రైవర్ గా ఉన్న భోళా శంకర్ ఎలా క్లోజ్ చేసాడు అన్నదే సినిమా. ఇలాంటి కథలను తెలుగు ప్రేక్షకులు కనీసం పదుల సంఖ్యలో చూసి ఉంటారు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటం తో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాదు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి, వెన్నెల కిషోర్ మధ్య సాగే సన్నివేశాలు కాస్త నవ్విస్తాయి. చిరంజీవికి ఈ తరహా పాత్ర అలవాటు అయినది కావటంతో అలవోకగా చేసుకుంటూ పోయారు. కొన్ని చోట్ల ఫైట్ సీన్స్ స్టైలిష్ గా ఉన్నాయి. హీరోయిన్ తమన్నా లాయర్ పాత్ర కూడా కామెడీగానే ఉంటుంది. ఒక క్యాబ్ లో కలిసిన సుశాంత్ , కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ కూడా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్లు ఉంది తప్ప ఇందులో కూడా ఏ మాత్రం డెప్త్ లేదు. పలు చోట్ల పవన్ కళ్యాణ్ మ్యానెరిజం పెట్టిన అది కూడా ఎక్కడ పేలలేదు. ఓవర్ అల్ గా చూస్తే భోళా శంకర్ సినిమా పాత కథతో బోల్తా కొట్టింది అనే చేప్పాలి.

రేటింగ్ :2 .25 -5

Next Story
Share it