Telugu Gateway
Movie reviews

కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రయోగం ఫలించిందా?!

కళ్యాణ్ రామ్ అమిగోస్  ప్రయోగం ఫలించిందా?!
X

అదేమి విచిత్రమో కానీ కొన్ని సినిమాల్లో మంచి వాళ్లకు నటించే అవకాశమే ఉండదు. విలన్లు మాత్రమే నటనలో ఇరగదీస్తారు. అది ఎన్టీఆర్ జై లవకుశ అయినా..ఇపుడు అయన సోదరుడు కళ్యాణ్ రామ్ అయినా. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన నెగిటివ్ క్యారెక్టర్ కు వచ్చిన పేరు..ఇతర పాత్రలకు రాలేదు అనే చెప్పాలి. ఇప్పుడు అమిగోస్ సినిమాలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రిభినయం చేసిన విషయం తెలిసిందే. అసలు ఈ టైటిలే విచిత్రంగా ఉంది. అమిగోస్ అంటే ఏమిటో అని చెక్ చేస్తే గూగుల్ మాత్రం స్నేహితులు అని చెపుతుంది. బింబిసార సినిమా సూపర్ హిట్ కావటం తో కళ్యాణ్ రామ్ అదే జోష్ లో వెరైటీ టైటిల్ తో అమిగోస్ సినిమా చేశారు. దర్శకుడు రాజేంద్ర రెడ్డి కి ఇది తొలి సినిమా. కథ కూడా ఆయనదే. సినిమా స్టోరీ విషయానికి వస్తే రాముడు మంచి బాలుడు టైపు కళ్యాణ్ రామ్ తండ్రి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. ఒక సారి పబ్ లో జరిగిన గొడవలో మనిషిని పోలినవాళ్లు చాలా మంది ఉంటారు అని చెపుతారు. ఇంటికి వచ్చిన తర్వాత కళ్యాణ్ రామ్ డోపెల్‌గాంగర్ వెబ్ సైట్ లో చెక్ చేస్తాడు. అందులోనే తొలుత బెంగళూరు లో ఒకరు తనలా ఉన్నట్లు తేలుతుంది. తర్వాత కలకత్తా లో మరోకరు తేలతారు.వీళ్ళ ముగ్గురు గోవా లో కలుసుకోవడానికి ప్లాన్ చేసి అక్కడ సమావేశం అవుతారు.

అక్కడ నుంచే కథలో మలుపులు స్టార్ట్ అవుతాయి. ఈ ముగ్గురిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న బిపిన్ రాయ్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకుంటాడు. మిగిలిన రెండు పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అసలు బిపిన్ రాయ్ కోసం ఎన్ఐఏ టీంలు ఎందుకు వెతుకుతాయి...మరి ఎన్ఐఏ టీంల నుంచి బిపిన్ తప్పించుకున్నాడా లేదా...తన అవసరాల కోసం తనలా ఉన్న ఇద్దరినీ బిపిన్ ఎలా వాడుకున్నాడు అన్నదే సినిమా. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ బాగానే చేసిన...బిపిన్ రాయ్ పాత్రే ఈ సినిమాకు హై లైట్ అని చెప్పొచ్చు. పాత్రకు తగ్గ గొంతు కూడా సినిమాలో ఈ క్యారక్టర్ బలం మరింత పెంచింది. హీరోయిన్ ఆషికా రంగనాధన్ లుక్స్ పరంగా ఒకే అనిపించినా ఆమె పాత్రకు ఇందులో పెద్ద ప్రాధాన్యత లేదు. దర్శకుడు రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్న లైన్ ఆకట్టుకునేలా ఉన్న సినిమాలో జోష్ కన్పించదు. బిపిన్ రాయ్ గా కళ్యాణ్ రామ్ పాత్ర, సెకండ్ హాఫ్ ఆకట్టుకుంటాయి. ఓవర్ అల్ గా చూస్తే కళ్యాణ్ రామ్ తన వంతు ఒక కొత్త ప్రయోగం చేశాడు అని చెప్పొచ్చు.

రేటింగ్: 2 .75 /5



Next Story
Share it