'అల్లుడు అదుర్స్' మూవీ రివ్యూ
ఓ వైపు సంక్రాంతి సందడి. మరో వైపు కొత్త సినిమాల హంగామా. తొమ్మిది నెలల విరామం తర్వాత థియేటర్లు తెరుచుకోవటంతో ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే రిలాక్సేషన్ కోసం థియేటర్లకు క్యూకడుతున్నారు. ఈ సంక్రాంతికి ఏకంగా క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలతోపాటు మాస్టర్ కూడా విడుదల అయింది. అయితే కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి బయటపడిన ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో ఊరటనిచ్చే సంక్రాంతి సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదనే చెప్పాలి. ఉన్నంతలో కాస్త రవితేజ సినిమా 'క్రాక్'కు మంచి టాక్ వచ్చింది. ఎప్పటి నుంచో అల్లుడు సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' అంటూ సంక్రాంతి బరిలో నిలిచాడు. కానీ మరోసారి ఈ యువ హీరోకు నిరాశే. అదే పాత కథ..అదే రొటీన్ ఫార్ములా. కందిరీగ కథలో అటూ ఇటూ మార్పులు చేసి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ప్రేక్షకుల మీదకు వదిలారు.
సినిమాలో ఎక్కడా బలమైన అంశాలు లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. దర్శకుడు కామెడీని నమ్ముకుని సినిమాను లాగించేయాలని ప్రయత్నం చేసినా అది కూడా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. సహజమైన తెలుగు సినిమాల ఫార్ములా అయిన సినిమా అంతా హీరో చుట్టూనే సాగుతుంది. ఇందులోనూ అదే రిపీట్ అయింది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లోనూ ఇంకా పూర్తి పట్టు సాధించలేదనే విషయం సినిమాలో స్పష్టంగా కన్పిస్తోంది. కాకపోతే ఫైట్స్ విషయంలో మాత్రం ఓకే అన్పిస్తాడు. ఓవరాల్ గా చూస్తే అల్లుడు అదుర్స్ ఓ రొటీన్ సినిమా.
రేటింగ్. 2.25/5