Telugu Gateway
Movie reviews

‘ఉగ్రం’ మూవీ రివ్యూ

‘ఉగ్రం’ మూవీ రివ్యూ
X

ఏ హీరోకు అయినా పరిశ్రమలో ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం అంత సామాన్య విషయం కాదు. ఇది టాప్ హీరో ల దగ్గర నుంచి ప్రతి హీరో కి వర్తిసుంది. అలాంటిది అల్లరి నరేష్ గా కొన్ని సంవత్సరాలపాటు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్ కొద్ది కాలం నుంచి ట్రాక్ మార్చారు. ట్రాక్ మార్చిన తర్వాత చేసిన నాంది సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత వచ్చిన ఇట్లు మారీడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా కూడా ఆకట్టుకున్నారు. ఇది నాంది అంత విజయాన్ని అందించకపోయినా పర్వాలేదు అనిపించింది. తనకు నాంది సినిమా తో హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడల తో నరేష్ చేసిన సినిమా నే ఉగ్రం. అసలు నరేష్ సినిమాకు ఈ టైటిల్ పెట్టడమే ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. ఇక సినిమా కథ విషయానికి వస్తే నరేష్ ఈ సినిమా లో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ పై ఎక్కువ ఫోకస్ పెట్టే భార్య, కూతురికి వారు కోరుకున్నంత సమయం ఇవ్వలేడు నరేష్. చివరకు కూతురు పుట్టిన రోజు కూడా అదే పరిస్థితి. దీంతో నరేష్ భార్య, కూతురి ని తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది. భార్యను కన్విన్స్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అవటం తో చివరకు నరేష్ వాళ్ళను వరంగల్ నుంచి హైదరాబాద్ లో దింపటానికి బయలు దేరాడు. ఆ సమయంలో కారు పెద్ద ప్రమాదానికి గురి అవుతుంది.

ఆ ప్రమాదంలో గాయపడ్డ నరేష్ డిమినిషియా అనే సమస్య బారిన పడతాడు. ఈ ప్రమాదంలో గాయపడిన నరేష్ భార్య, కూతురు ఏమి అయ్యారు. వాళ్ళను వెతికి పట్టుకునే సమయంలో వెలుగులోకి వచ్చిన మిస్సింగ్ కేసు ల వెనక ఉన్న అసలు కథ ఏమిటి...వీళ్ళను హీరో ఎలా కాపాడాడు అన్నదే ఉగ్రం సినిమా. నరేష్ సీరియస్ పోలీస్ అధికారిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా దర్శకుడు కథను నడిపించిన తీరు...సినిమాను గాడి తప్పేలా చేసింది. ఈ సినిమాలో అత్యంత కీలకం అయిన ఇన్వెస్టిగేషన్ అంశం చాలా రొటీన్ గా అలా సాగిపోతుంది తప్ప ఇందులో ఎలాంటి ఉత్కంఠ..ఆసక్తి కలిగించే అంశాలు లేవు అని చెప్పాలి. అదే సమయంలో నరేష్ ఫైట్స్ కు ఇచ్చిన ఎలివేషన్స్ బాలకృష్ణ సినిమా రేంజ్ లో ఉండటంతో ఇది ప్రేక్షకులకు ఏ మాత్రం కనెక్ట్ అయ్యేలా లేదు అనే చెప్పాలి. ఎంత సీరియస్ పాత్రలు చేసినా కథలో దమ్ము ఉండేలా చూసుకోవాలి కానీ...ఇంతలా ఎలివేషన్స్ ఇస్తే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కటం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే నరేష్ తన పాత ఇమేజ్ పోగొట్టుకోవాలి అంటే అది అంత త్వరగా పోదు అనే విషయం తెలిసిందే. సినిమా లో మరో కీలకమైన అంశం ఏమిటి అంటే హీరో అల్లరి నరేష్, మిర్న మీనన్ ల లవ్ ట్రాక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఓవరాల్ గా చూస్తే ఉగ్రం మూవీ నరేష్ స్పీడ్ కు బ్రేక్ లు వేసింది అనే చెప్పాలి.

రేటింగ్ : 2 . 25 /5

Next Story
Share it