‘అహింస’ మూవీ రివ్యూ
ఈ సినిమాపై ఒకింత హైప్ క్రియేట్ అయింది అంటే దర్శకుడు తేజ వల్లే అని చెప్పొచ్చు. కొన్ని సినిమాలను హీరో లు డ్రైవ్ చేస్తారు...కొన్ని సినిమాలను దర్శకులు డ్రైవ్ చేస్తారు. అంతిమగా సినిమా విజయం మాత్రం కథ..అందులోని కీలక నటీ నటుల యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. అహింస సినిమా ద్వారా దర్శకుడు తేజ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరామ్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇది కూడా సినిమాపై ఆసక్తి పెంచటానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే ఉపయోగపడింది. ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న హీరో ల్లో ఎక్కువ శాతం అంటే దగ్గర దగ్గర 80 నుంచి 90 శాతం వరకు పరిశ్రమతో నేరుగానో..పరోక్షంగానో సంబంధాలు ఉన్న వాళ్లే అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఇక సినిమా విషయానికి వస్తే దర్శకుడు తేజ ఒక సింపుల్ లైన్ అంటే చీమకు కూడా అపకారం తలపెట్టని వ్యక్తి చివరకు ఎందుకు వైలెంట్ గా మారాల్సి వచ్చింది అన్నదే ఈ సినిమా కథ. దీనికి ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు హీరోయిన్ ను రేప్ చేయటం....తర్వాత తమ పరపతి ఉపయోగించుకుని ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయటం.
మరి తాను ప్రేమించే అమ్మాయిని రేప్ చేసినవారికి హీరో ఎలా శిక్షపడేలా చేశాడు అన్నదే అహింస మూవీ. ఈ సినిమాలో అభిరామ్ కు జోడిగా గీతికా తివారి నటించారు. ఇతర కీలక పాత్రల్లో సదా, రజత్ బేడీ, దేవి ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాలో హీరో దగ్గుబాటి అభిరామ్ నటన గురించి చెప్పుకోవటానికి ఏమి లేదు ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు దర్శకుడు తేజ యువత ను టార్గెట్ గా చేసుకుని తీసినట్లు అనిపిస్తాయి. చివరకు మేక ను కూడా బలి ఇవ్వటానికి ససేమిరా అనే హీరో...సెకండ్ హాఫ్ లో మాత్రం తుపాకులు...కత్తులతో ఆటాడుకునేలా చేశాడు. మరో వైపు ఒక పక్కన శవాలను పెట్టుకుని ఐటెం సాంగ్ పెట్టడం ఈ సినిమాలో ప్రేక్షకులకు షాక్ ఇచ్చే అంశం అని చెప్పొచ్చు. హీరో, హీరోయిన్లు టాలీవుడ్ కు కొత్తవాళ్లు కావటంతో భారం అంతా దర్శకుడు తేజపైనే పడింది. అయితే అయన ఈ సినిమాలో తనదైన మార్క్ చూపించలేక పోయారు. సినిమా మొదలవ్వటమే పోలీస్ ఆఫీసర్ రవి కాలే తప్పిపోయిన దుశ్యంతరావు అనే అతని కోసం వెతుక్కుంటూ వెళతాడు. ఆలా ఆ ఫైల్ చదువుతుంటే ఈ సినిమా కథ మొదలవుతుంది ఇలా కథ చెప్పిన విధానం బాగానే ఉన్నా కొత్తదనం ఏమీ లేకపోవటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు అనే చెప్పాలి.
రేటింగ్: 2 .25 /5