Telugu Gateway
Movie reviews

'ఏ1 ఎక్స్ ప్రెస్ ' మూవీ రివ్యూ

ఏ1 ఎక్స్ ప్రెస్  మూవీ రివ్యూ
X

స్పోర్ట్స్ కథాంశాలతో తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో సినిమాల జోరుగా బాగా పెరిగింది. నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇటీవలే నితిన్ హీరోగా నటించిన 'చెక్' సినిమా కూడా ఇదే బాపతు. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా హిట్ కోసం హాకీ క్రీడతో అల్లిన కథతో 'ఏ1 ఎక్స్ ప్రెస్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే యానాంలో సముద్రానికి అనుకుని ఉన్న ఓ హాకీ స్టేడియం. ఈ స్టేడియం స్థలంపై ప్రభుత్వంలోని పెద్దల కన్ను. ఎంతో చరిత్ర ఉన్న హాకీ స్టేడియాన్ని క్రీడాకారులు, గ్రామస్తులు ఎలా కాపాడుకున్నారు..అందులో హీరో సందీప్ కిషన్ పాత్ర ఏమిటి అన్నదే సినిమా. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఇద్దరూ హాకీ క్రీడాకారులే. అయితే హీరో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడు అన్న విషయం ఫస్టాఫ్ ముగిసే వరకూ ఎక్కడా చూపించరు. సినిమాలో అసలైన ట్విస్ట్ ఫస్టాఫ్ చివర్లోనే వస్తుంది. అప్పటి నుంచే సినిమాలో కాస్త వేగం పెరిగినట్లు కన్పిస్తుంది.

అప్పటివరకూ రొటీన్ పార్ములానే నమ్ముకోవటంతో సినిమా చాలా స్లోగా సాగినట్లు కన్పిస్తోంది. సెకండాఫ్ లోనూ క్లైమాక్స్ లోనే సినిమాలో కాస్త జోరు పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రధాన బలం హాకీ కోచ్ గా, మాజీ మిలటరీ అధికారిగా కన్పించిన మురళీ శర్మ, స్పోర్ట్స్ మంత్రిగా నటించిన రావు రమేష్ లే అని చెప్పొచ్చు. సందీప్ కిషన్ తన పాత్రకు న్యాయం చేశారు. అయితే హీరోయిన్ లావణ్య పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. క్రీడలనే నమ్ముకుని ఉండేవారికి ఎదురయ్యే కష్టాలు..క్రీడల్లో చోటుచేసుకుంటున్న రాజకీయాలను సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే కథను గ్రిప్పింగ్ గా చూపించటంలో దర్శకుడు డెనిస్ జీవన్ కనుకొలను చూపించలేకపోయారు. దీంతో సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా ఓ రొటీన్ సినిమాగా మిగిలిపోతుంది.

రేటింగ్. 2.25/5

Next Story
Share it