Telugu Gateway
Cinema

నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు

నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు
X

సత్య దేవ్ హీరో గా తెరకెక్కిన సినిమా జీబ్రా. వాస్తవానికి ఈ సినిమా దీపావళికి అంటే అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని నవంబర్ 22 కి మారుస్తూ న్యూ లుక్ ను విడుదల చేసింది. ఈ సారి దీపావళి రేస్ లో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి జీబ్రా విడుదల వాయిదాకు కారణం ఏంటో తెలియదు కానీ..నవంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా కీలక పాత్ర పోషించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన జీబ్రా రిలీజ్ డేట్ మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. జీబ్రా సినిమా లో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంటే...రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.

Next Story
Share it