Telugu Gateway
Cinema

ఆక‌ట్టుకోని ఎఫ్‌3 సాంగ్

ఆక‌ట్టుకోని ఎఫ్‌3 సాంగ్
X

ఆక‌ట్టుకోని ఎఫ్‌3 సాంగ్పుష్ప సినిమాలో ఊ అంటావా మామా..ఉహూ అంటావా మామా పాట ఎంత దుమ్మురేపిందో తెలిసిందే. ఇప్పుడు అచ్చం అదే త‌ర‌హాలో ఎఫ్ 3 సినిమా కోసం చిత్ర యూనిట్ ఊ ఆ అహా అహా అంటూ ఓ పాట‌ను విడుదల చేసింది. స‌హ‌జంగా టాలీవుడ్ లో ఏదైనా ఫార్ములా హిట్ అయింది అంటే అంద‌రూ కొంత కాలం దాని వెంటే ప‌డ‌తారు. ఇప్పుడు ఎఫ్ 3 యూనిట్ కూడా అదే ప‌నిచేసిన‌ట్లు క‌న్పిస్తోంది. అయితే ఈ పాట‌లో త‌మ‌న్నా...మెహ‌రీన్ అందాల ప్ర‌ద‌ర్శ‌న మిన‌హా పాట ఎక్క‌డా కూడా ప్రేక్ష‌కుల్లో ఊపు తెచ్చే పరిస్థితి లేదు అంతే కాదు..పోనీ విన‌టానికి ఏమైనా అంత బాగుందా అంటే అదీలేదు. ఎఫ్ 2 సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌టంతో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అదే టీమ్ తో ఎఫ్ 3 సినిమాను తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్, వారిద్ద‌రికీ జోడీలుగా త‌మ‌న్నా, మెహ‌రీన్ లు న‌టించారు. ఈ పాట మ‌ధ్య‌లో సునీల్ రాక మరో విశేషం. 'నీ కోర మీసం చూస్తుంటే...నువ్వట్టా తిప్పేస్తుంటే... ఊ ఆ అహా అహా! నీ మ్యాన్లీ లుక్కేచూస్తుంటే... మూన్ వాక్ చేసే నా హార్టే' 'ఊ ఆ అహా అహా!' అంటూ ఈ సాంగ్ సాగింది. ఈ పాటకి కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ , దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.సునిధి చౌహాన్ , లవితా లోబో, సాగర్‌,ఎస్పీ అభిషేక్‌ ఆలపించారు. పూర్తి స్థాయి కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 27న విడుద‌ల కానుంది.

Next Story
Share it