టాప్ హీరోల నంబర్ల గేమ్ పైనే అందరి దృష్టి!
అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా పుష్ప 2 విడుదల పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు అమెరికా లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా 509 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇదే ఎన్టీఆర్ కెరీర్ లో అత్యదికి వసూళ్లు సాధించిన సినిమా. ఇప్పటివరకు టాలీవుడ్ లో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక హీరో అంటే ప్రభాస్ మాత్రమే అని చెప్పాలి. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరతారా లేదా అన్నది డిసెంబర్ 5 తర్వాత కానీ తేలదు. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప 2 సినిమా వసూళ్ల పైనే ఉన్నాయని చెప్పాలి. మరో వైపు పుష్ప 2 విడుదల అయిన నెల రోజుల తర్వాత సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల లో జాప్యం చోటు చేసుకోవటం ..శంకర్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించకపోవటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఒకింత ఆందోళన ఉంది అని చెప్పొచ్చు.
టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు వరసగా విడుదల అవుతుండంతో సహజంగానే ఈ సినిమా కలెక్షన్స్ ఆధారంగా ఫ్యాన్స్ లో చర్చ సాగటం సహజమే అన్న అభిప్రాయం ఉంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు నంబర్ల గేమ్ లో ముందు వరసలో నిలుస్తారో చూడాలి. ఆదివారం సాయంత్రం విడుదల కానున్న పుష్ప 2 ట్రైలర్ కూడా సినిమా పై ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేందుకు దోహదపడొచ్చు. మరో వైపు పుష్ప లో సమంత ఐటెం సాంగ్ సంచలన విజయం దక్కించుకోగా..మరి ఇప్పుడు అల్లు అర్జున్..డ్యాన్సింగ్ క్వీన్ గా పేరున్న శ్రీ లీల తో కలిసి చేసిన స్పెషల్ సాంగ్ ఎలాంటి ప్రభుత్వం చూపిస్తుందో చూడాలి. ఇవన్నీ కలిపే అల్లు అర్జున్ సినిమా వసూళ్లను డిసైడ్ చేస్తాయనే టాక్ నడుస్తోంది.