దర్శకుడు లేకుండా సెలెబ్రేషన్స్ ఏంటో?

అంతా బాగానే ఉంది కానీ...ఈ గుంటూరు కారం సెలెబ్రేషన్స్ ఫొటోల్లో ఎక్కడా కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించటకపోవటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు యాక్షన్ దుమ్మురేపినా కూడా కథలో దమ్ములేకపోవటం వల్లే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అని...దీనికి అంతటికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.మహేష్ బాబు ఫ్యాన్స్ తో సినీ ప్రేమికులు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్. విమర్శలకు బయపడి అయన ఈ సెలెబ్రేషన్స్ కు దూరంగా ఉన్నారా..లేక మారేదైనా కారణం ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది. సంక్రాంతి పండగ రోజు మహేష్ బాబు ఇచ్చిన పార్టీ లో హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, నిర్మాత నాగ వంశీ, దిల్ రాజు తదితరులు కనిపించారు. ఈ సినిమాకు మూడు రోజుల్లోన్ నూట అరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.