Telugu Gateway
Cinema

ఏ మూవీ ప్లేస్ ఎక్కడ?

ఏ మూవీ ప్లేస్ ఎక్కడ?
X

ఎన్నడూ లేని రీతిలో ఈ సారి టాలీవుడ్ లో ఏకంగా ఐదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి. సంక్రాంతికి ఎప్పుడూ రెండు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఒకటి లేదా రెండు మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమాలు ఉండేవి. కానీ ఈ సారి మాత్రం గతానికి భిన్నంగా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ సంక్రాంతికి వచ్చిన వాటిలో భారీ బడ్జెట్ మూవీస్ అంటే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజాసాబ్ ముందు వరసలో ఉంటుంది. రెండవ భారీ బడ్జెట్ సినిమా అంటే చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ. అయితే ఇక్కడా ఒక తేడా ఉంది. రాజాసాబ్ మూవీకి స్టార్ కాస్ట్ తో పాటు భారీ భారీ సెట్టింగ్స్ ..ఇతర నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే ఉంది. కానీ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు మూవీ దగ్గరకు వచ్చే సరికి ఇక్కడ బడ్జెట్ అంతా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్స్ కే వెళ్ళింది అని..రాజాసాబ్ తో పోలిస్తే ఈ సినిమాకు నిర్మాణ వ్యయం చాలా చాలా తక్కువ అని చెపుతున్నారు.

మరో వైపు చిరంజీవి ఈ సినిమాకు రెమ్యూనేషన్ గా 70 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. మన శంకర వరప్రసాద్ గారు మూవీ లో చిరంజీవి తో పాటు వెంకటేష్, నయనతార లకు కూడా దగ్గర దగ్గర చెరో పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఉంటుంది అని చెపుతున్నారు. వరుసగా హిట్స్ సాధిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ కూడా 25 కోట్ల రూపాయల పైనే ఉంటుంది అని....ఈ సినిమా కు ఖర్చు అంతా రెమ్యూనరేషన్స్ లోనే వెళ్ళింది అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. ఈ సంక్రాంతి సీజన్ లో ఫస్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. ఇందులో ప్రభాస్ యాక్షన్ బాగానే ఉన్నా కూడా సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీంతో ఈ సినిమా పై ప్రభావం పడింది. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ లో సినిమా చేయటంతో తొలుత దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలం అయింది. ప్రభాస్ కు ఉన్న స్టామినా దృష్టా ఈ సినిమా వసూళ్లపరంగా పరవాలేదు అనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 225 కోట్ల రూపాయల పైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది .

ఇక చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ విషయానికి వస్తే ఈ సినిమా కు ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కథ లో పెద్ద విషయం లేకపోయినా కూడా ఇందులో చిరంజీవి స్టైలిష్ లుక్ ...దర్శకుడు అనిల్ రావిపూడి స్టోరీని నడిపించిన విధానం బాగా వర్క్ ఔట్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులోని కామెడీ...వెంకటేష్, నయనతార పాత్రలు కూడా మంచి ప్రభావం చూపించాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 152 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు మహిళా ప్రేక్షకులను కూడా ఇది విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీ హిట్ టాక్ ను సొంత చేసుకుంది.

భారీ బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు మూవీ ల్లో చిరంజీవి మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే ...రెండవ స్థానాల్లో ప్రభాస్ సినిమా ఉంటుంది. మిగిలిన మూడు సినిమాల్లో మరో సీనియర్ హీరో రవితేజ సినిమా బడ్జెట్ మిగిలిన రెండు సినిమాల కంటే కాస్త ఎక్కువే ఉంటుంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజ సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి మంచి టాక్ ను దక్కించుకుంది. ఇందులో కొత్త రవితేజ కనిపించటంతో పాటు తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజంగా ఈ సినిమా బాగున్నా కూడా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం అయినట్లే కనిపిస్తోంది. ఇందులో రవితేజ కు జోడిగా నటించిన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి మంచి సందడి చేశారు. జనవరి 14 ఉదయం నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒకరాజు మూవీ విడుదల కాగా...సాయంత్రం శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చింది..ఈ రెండు సినిమాలు కూడా కథ పరంగా...కామెడీ పరంగా కూడా ప్రేక్షుకులను మంచి గా ఎంటర్ టైన్ చేసిన మూవీలే. ఈ రెండింటి విషయంలో పోలిస్తే నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు కంటే శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ నే ముందు ఉంది అని చెప్పాలి. అయితే నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగ ఒక రాజు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ కావటంతో ఈ మూవీని బలంగా ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లగలిగారు. దీనికి తోడు నవీన్ పోలిశెట్టి ప్రచారం కూడా బాగానే కలిసి వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారీ నారీ నడుమ మురారి మంచి టాక్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.

బాక్స్ ఆఫీస్ కల్లెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సంక్రాంతి విన్నర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ నే ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.కథ పరంగా,,,ఎంటర్ టైనమెంట్ పరంగా చూసుకుంటే రెండవ ప్లేస్ లో నారీ నారీ నడుమ మురారి ఉంటుంది. కాకపోతే కలెక్షన్స్ పరంగా ఈ మూవీ కంటే అనగనగ ఒక రాజు మూవీనే రెండవ ప్లేస్ లో ఉంటుంది. ఇక రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం నాల్గవ ప్లేస్ కు వెళుతుంది. ప్రభాస్ మూవీ జానర్ వేరు కావటంతో ఆ సినిమా ను ఇందులో కలపలేదు. మొత్తం చూస్తే సంక్రాంతి విన్నర్స్ వరసగా ఇలా ఉన్నట్లు. ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ మనశాంకర వరప్రసాద్ ఆ తర్వాత వరసగా నారీ నారీ నడుమ మురారి, అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలు.

Next Story
Share it