Telugu Gateway
Cinema

ఇవి పండగ సినిమాలా..ఫ్యాన్స్ సినిమాలా?!

ఇవి పండగ సినిమాలా..ఫ్యాన్స్ సినిమాలా?!
X

టాలీవుడ్ సంక్రాంతి ముగిసింది ఇక మిగిలింది వసూళ్ల లెక్కలే తేలాలి. అయితే ఇద్దరు పెద్ద హీరోలు అంటే మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించటంతో ఈ లెక్కలు ఎంత మేర బయటకి వస్తాయి..వచ్చే లెక్కల్లో ఎంత మేర వాస్తవం ఉంటుంది అన్నది వేచిచూడాల్సిందే. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ప్రస్తావించుకోవాలి. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యలు పండగా సినిమాలు కానే కాదు. ఇవి పండగను వాడుకోవడానికి వచ్చిన సినిమాలు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే పండగ సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలి. కానీ ఈ రెండు ఫాన్స్ సినిమాలు తప్ప ప్రేక్షకులు, పండగ సినిమాలు కావు. ఈ సంక్రాంతి సీజన్లో లో ఫస్ట్ బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదల అయింది. ఇందులో బాలకృష్ణ ను గాడ్ అఫ్ మాసెస్ అని చూపిస్తే...వాల్తేర్ వీరయ్య సినిమా లో చిరంజీవిని బాస్ అఫ్ మాసెస్ అని చూపించారు. వాస్తవానికి వీరసింహరెడ్డి, వాల్తేర్ వీరయ్య రెండు సినిమాలు పూర్తి భిన్నమైనవి. బాలకృష్ణ సినిమా పూర్తిగా రాయలసీమ ఫ్యాక్షన్, పొలిటికల్ టచ్ తో సాగిన సినిమా. ఇందులోకి రాజకీయ డైలాగ్స్ కూడా కాకరేపుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ వీరసింహారెడ్డి పాత్రలో దుమ్ము రేపారు అని చెప్పొచ్చు.

ఆ పాత్ర తీర్చిదిద్దిన తీరు...అయన స్టైలిష్ ఫైట్స్ సినిమాకు అత్యంత కీలకంగా మారాయి. ఇందులోని జై పాత్రలో కనిపించిన బాలకృష్ణ రోల్ మాత్రం తేలిపోతుంది. దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి పై పెట్టిన ఫోకస్ జై సింహారెడ్డి పాత్రను పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించదు. కాకపోతే వీరసింహారెడ్డి ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ , పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ గా నిలిచాయి. ఇది పూర్తిగా బాల కృష్ణ ఫాన్స్. పొలిటికల్ ప్రయోజనాల కోణంలో తీసిన సినిమా. అంతే కానీ కేవలం ఎంటర్ టైన్మెంట్ కోరుకొనే, సామాన్య ప్రేక్షకులకు ఇది నచ్చకపోవచ్చు. ఇక శుక్రవారం నాడు విడుదల అయిన వాల్తేర్ వీరయ్య సినిమా విషయానికి వస్తే ఇది చిరంజీవి చిన్నప్పుడు ఎప్పుడో చేసేసిన సినిమాలాంటిదే. ఈ సినిమా స్టోరీ లోనూ ...చిరంజీవి యాక్షన్ లోనూ దర్శకుడు బాబీ ఎక్కడా కొత్తదనం చూపించలేక పోయారు. పెద్ద పెద్ద వ్యవస్థలు ఉండే పోలీస్, నేవీ లు అంతర్జాతీయ డ్రగ్ డాన్స్ ను పట్టుకోవడానికి వీరయ్య పై ఆధారపడతారు అనేలా చూపించటం చిరంజీవి సినిమాలో చేసిన కామెడీకి డైరెక్టర్ జోడించిన కామెడీ అనుకోవచ్చు. ఈ సినిమాలో అంతర్జాతీయ డ్రగ్ డాన్స్ గా ఉన్న ప్రకాష్ రాజ్, బాబీ సింహ ల పాత్రల్లో ఎక్కడా పెద్దగా బలం కనిపించదు. పూనకాలు లోడింగ్ పూనకాలు లోడింగ్ అంటూ హైప్ అయితే బాగానే పెంచారు కానీ...పెంచిన హైప్ మేరకు సినిమాలో ఊపు తీసుకురావటంలో విఫలమయ్యారు అనే చెప్పాలి. సో ఇక్కడ ఎవరు విజేత అన్నది రాబోయే రోజుల్లో లెక్కలు చెప్పాలిసిందే. లెక్కలు మాట్లాడాలిసిందే. రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటి అంటే తలలు తెగిపడటం మాత్రమే.

Next Story
Share it