నెట్ ఫ్లిక్స్ లో వార్ 2 మూవీ

ఈ ఏడాది ఆగస్ట్ 14 న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా వార్ 2 . ఇందులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ టాప్ హీరో ల్లో ఒకరైన ఎన్టీఆర్ కూడా నటించిన సంగతి తెలిసింది. ఎన్టీఆర్ నేరుగా చేసిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ కూడా ఇదే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే వార్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది అనే చెప్పాలి. ఆగస్ట్ 14 నే రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ మూవీ కూడా విడుదల అయింది. రెండు భారీ సినిమా ల మధ్య పోటీ ఏర్పడటం కూడా వార్ 2 కలెక్షన్స్ పై బాగానే ప్రభావం చూపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయిన వార్ 2 సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది.
ఈ మూవీ అక్టోబర్ తొమ్మిది నుంచే ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్ భాషల్లో ఈ మూవీ అందుబటులో ఉంటుంది అని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమే ఈ వార్ 2 . ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీని నిర్మించింది. వార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 355 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయిన వార్ 2 ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటోందో చూడాలి. నెగిటివ్ టాక్ తో ఎక్కువ మంది ఈ సినిమా ను థియేటర్ లో చూడటానికి చాలా మంది ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి వస్తుండటంతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.



