Telugu Gateway
Cinema

చిరు ముందుకు ..బాలయ్య వెనక్కు

చిరు ముందుకు ..బాలయ్య వెనక్కు
X

సంక్రాంతి సినిమా ల లెక్కలు మారుతున్నాయి. వీరసింహారెడ్డి సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో 54 కోట్ల రూపాయల గ్రాస్ తో రికార్డు నెలకొల్పింది. తర్వాత క్రమక్రంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా అటు వీరసింహ రెడ్డి, ఇటు వాల్తేర్ వీరయ్య సినిమాల లెక్కలు వెల్లడించింది. దీని ప్రకారం బాలకృష్ణ కంటే చిరంజీవి సినిమా వసూళ్లు ఏక్కువగా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు వచ్చేశాయ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. అదే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. అయితే వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయనే టాక్ పరిశ్రమ వర్గాల్లో ఉంది.

అందులోనూ వీరసింహారెడ్డి కంటే వాల్తేర్ వీరయ్య సినిమానే ముందు ఉంది. వీరసింహారెడ్డి సినిమా పొలిటికల్ టచ్, పంచ్ డైలాగ్స్ తో పాటు టైటిల్ రోల్ పోషించిన బాల కృష్ణ నటన ఆకట్టుకుంది. వాల్తేర్ వీరయ్య విషయానికి వస్తే ఈ సినిమాలో చిరంజీవి కామెడీ హై లైట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చిన రవితేజ, చిరు కాంబినేషన్ నటన సినిమాకు ప్లస్ అయింది. . కలెక్షన్ల పరంగా చూసుకుంటే సంక్రాంతి విజేత వాల్తేర్ వీరయ్య అని చెప్పాలిసిందే. అమెరికాలో ఇంకా వాల్తేర్ వీరయ్య మంచి వసూళ్లు సాగిస్తున్నట్లు చెపుతున్నారు. తొలివారం పూర్తిచేసుకునే నాటికీ ఈ రెండు సినిమాల వసూళ్లు మరింత పెరుగుతాయనే విషయం తెలిసిందే. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన లెక్కలు చూసి ఇవేంటి అముబులెన్సుల టోల్ ఫ్రీ నంబర్లులాగా 108 , 104 అంటూ సెటైర్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో.

Next Story
Share it