Telugu Gateway
Cinema

ఆగని వీరయ్య దూకుడు...వీక్ అయిన వీరసింహ రెడ్డి

ఆగని వీరయ్య దూకుడు...వీక్ అయిన వీరసింహ రెడ్డి
X

సంక్రాంతి సినిమాల బరిలో నిలిచిన చిరంజీవి వాల్తేర్ వీరయ్య వసూళ్ల దూకుడు ఆగటంలేదు. రెండవ వారంలో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అదే సమయంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి వసూళ్లు బాగా వీక్ అయ్యాయి. వాల్తేర్ వీరయ్య 14 వ రోజున కూడా అంటే జనవరి 26 న 2 . 11 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మొత్తంమీద చూస్తే ఈ సినిమా 212 కోట్ల రూపాయల గ్రాస్..124 .27 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అదే వీరసింహారెడ్డి విషయానికి వస్తే ఈ సినిమా 15 వ రోజు కేవలం 26 లక్షల రూపాయల వసూలు మాత్రమే సాధించింది ఈ సినిమా మొత్తం మీద 127 .30 కోట్ల రూపాయల గ్రాస్, 76 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

వీరసింహారెడ్డి సినిమా ఈ వారాంతం తో థియేటర్లను ఖాళీ చేస్తుంది అని చెపుతున్నారు. వసూళ్ల పరంగా చూస్తే వీరయ్య మరికొన్ని రోజులు సాగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు ఏమి కూడా విడుదల లేకపోవటం వాల్తేర్ వీరయ్య కు మరో పాజిటివ్ అంశంగా ఉంది. శనివారం నాడు అంటే జనవరి 28 న హన్మకొండలో విజయోత్సవం చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని తెలిపింది.

Next Story
Share it