Telugu Gateway
Cinema

వాల్తేర్ వీరయ్య డబల్ సెంచరీ

వాల్తేర్ వీరయ్య డబల్ సెంచరీ
X

సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్య వసూళ్ల విషయంలో దుమ్మురేపింది. పది రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. సినిమా వసూళ్ళలో ఓవర్సీస్ మార్కెట్ కూడా కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. ఈ ఆదివారంనాడు కూడా అంటే జనవరి 22 న అమెరికాలో ఈ సినిమా 55881 డాలర్లు వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటికే రెండు మిల్లియన్లను దాటి ఇంకా ముందుకెళుతోంది. మెగామాస్ బ్లాక్ బస్టర్ అంటూ మైత్రి ఈ మేరకు కొత్త లుక్ విడుదల చేసింది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it