Telugu Gateway
Cinema

కలెక్షన్స్ లో వాల్తేర్ వీరయ్య దూకుడు

కలెక్షన్స్ లో వాల్తేర్ వీరయ్య దూకుడు
X

బాక్స్ ఆఫీస్ వసూళ్ల విషయంలో వాల్తేర్ వీరయ్య దూకుడు చూపిస్తున్నాడు. సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఇద్దరు హీరోల ఫాన్స్ ను సంతోష పరిచాయి అనే చెప్పాలి. అయితే లెక్కల విషయానికి వస్తే వీరసింహారెడ్డి కంటే వాల్తేర్ వీరయ్య ముందు ఉన్నాడు. ఆరు రోజులకు గాను బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి 109 .40 కోట్ల రూపాయల గ్రాస్.65 .10 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అదే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఐదు రోజులకు గాను 144.15 కోట్ల రూపాయల గ్రాస్.. 83.53 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

అయితే తమ హీరో సినిమా వసూళ్లు తక్కువగా ఉండటానికి తమకు థియేటర్స్ తక్కువ చేయటమే అని బాలకృష్ణ ఫాన్స్ మండిపడుతున్న విషయం తెలిసిందే. పండగ సెలవులు ముగియటంతో రెండు సినిమాల వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇంకా వాల్తేర్ వీరయ్య వసూళ్లే ఉన్నంతలో మెరుగుగ్గా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. వసూళ్ల పరంగా చూస్తే చిరంజీవి సినిమా బాలకృష్ణ సినిమా కంటే ఒక రోజు ఆలస్యంగా వచ్చికూడా లెక్కల్లో ముందు నిలవటం విశేషం, టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన సినిమాలు పోటీపడ్డాయి.

Next Story
Share it