Telugu Gateway
Cinema

వివాహ భోజ‌నంబు ట్రైల‌ర్ లో న‌వ్వుల విందు

వివాహ భోజ‌నంబు ట్రైల‌ర్ లో న‌వ్వుల విందు
X

స‌త్య అద‌రగొట్టాడు. న‌వ్వుల‌తో వివాహ భోజ‌నం పెట్టాడు. ట్రైల‌ర్ లోనే ఇలా ఉంటే మ‌రి సినిమాఎలా ఉంటుందో. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో స‌త్య హీరోగా తెర‌కెక్కుతున్న సినిమానే వివాహ భోజ‌నంబు. ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. స‌త్య‌కు జోడీగా ఈ సినిమాలో అర్జావీ రాజ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సందీప్ కిష‌న్ ఓ కీల‌క‌పాత్ర‌లో క‌న్పించ‌బోతున్నారు. క‌రోనా కష్టాలు..లాక్ డౌన్ వ‌ల్ల మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఎన్ని క‌ష్టాలు ప‌డ్డాయో వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో స‌త్య‌తోపాటు ఇత‌ర పాత్ర‌లు కూడా టైమింగ్ కు అనుగుణంగా న‌టించి న‌వ్వులు పూయించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ లాక్ డౌన్ ప్ర‌క‌ట‌న‌తో ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత ఇక న‌వ్వులే..న‌వ్వులు. త్వ‌ర‌లో సోనీ లివ్ ఒటీటీ లో సినిమా విడుద‌ల కానుంది. సత్య‌కు కొత్త‌గా పెళ్ళైన వెంట‌నే లాక్ డౌన్ పెడ‌తారు. అయితే ఇంట్లో ఉన్న బంధువుల‌ను ఎలా పోషించాలా అని స‌త్య లెక్క‌లు వేసుకుంటాడు. కానీ ఇంట్లోని వాళ్లు అంతా స‌త్య‌కు చుక్క‌లు చూపిస్తారు. ఆ క‌ష్టాల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అన్న‌ది తేలాలంటే సినిమా విడుద‌ల కావాల్సిందే.

Next Story
Share it