Telugu Gateway
Cinema

షాకింగ్ లుక్

షాకింగ్ లుక్
X

ఎవరైనా సరే ఈ ఫోటో చూడగానే టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చింది అనుకోవాల్సిందే. అంతలా ఉంది మరి ఈ మేక్ఓవర్. కానీ అసలు విషయం తరిచి చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే ఇందులో కనిపిస్తున్నది హీరోయిన్ కాదు...హీరో విశ్వక్ సేన్. ఆయన నటిస్తున్న కొత్త సినిమా లైలా సినిమా లోది ఈ న్యూ లుక్. చిత్ర యూనిట్ బుధవారం నాడు ఈ న్యూ లుక్ విడుదల చేయటంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ కు జోడిగా ఆకాంక్ష శర్మ నటిస్తోంది. లైలా విశ్వక్ సేన్ 12 వ సినిమా.

Next Story
Share it