Telugu Gateway
Cinema

వెంకీ అట్లూరి మళ్ళీ హిట్ దక్కిందా?!(Vishwanath & Sons Movie Movie Review)

వెంకీ అట్లూరి మళ్ళీ హిట్ దక్కిందా?!(Vishwanath & Sons Movie Movie Review)
X

హీరో సూర్య, మమిత బైజు జంటగా నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీ దర్శకుడు వెంకీ అట్లూరి కావటంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఎందుకంటే వెంకీ అట్లూరి తెరకెక్కించిన లక్కీ భాస్కర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ దక్కించుకుందో తెలిసిందే. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా టీజర్ ...ట్రైలర్ కూడా ఇది ఒక క్లీన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది అనే సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో టీజర్..ట్రైలర్ లోనే చాలా వరకు సినిమా కథ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు. భారీ అంచనాల మధ్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ లోనూ..ఈ మూవీ లో కూడా హీరో ..హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. ఎంతో ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా హీరో ను పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ ఎందుకు కోరుకుంటుంది. ఎక్కడో విదేశాల్లో డాక్టర్ చదువుతున్న హీరోయిన్ పారిశ్రామికవేత్తగా ఉన్న హీరో కుటుంబంలోకి ఎలా..ఎందుకు ప్రవేశించింది. పెళ్లి వ్యవస్థ మీద ఏ మాత్రం మంచి అభిప్రాయం లేని హీరో చివరకు పెళ్ళికి అంగీకరిస్తాడా లేదా అన్నదే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ స్టోరీ.

ఈ మూవీ లో హీరో సూర్య తో పాటు హీరోయిన్ మమిత బైజు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో అయితే హీరోయిన్ మమిత బైజు యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. హీరో సూర్య విషయానికి వస్తే పారిశ్రామికవేత్తగా స్టైలిష్ లుక్ తో యాక్షన్స్ పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోకి కూడా తన సత్తాచాటాడు. హీరో తల్లిగా రాధిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ మమిత బైజు ఒక వైపు ఆకతాయి అమ్మాయి గా సందడి చేస్తూనే....ఎమోషనల్ సీన్స్ లోనూ సత్తాచాటింది. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా చేసుకుని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. కొన్ని చోట్ల డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఫస్ట్ హాఫ్ జోష్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి కొంత స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. జీ వీ ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎక్కడా రాజీపడకుండా కథకు తగ్గట్లు సినిమాలో రిచ్ లుక్ కనిపిస్తుంది. ఈ సినిమాలో నాజర్, రవీనాటండన్, రఘుబాబు, ఆది, సర్వదమన్ బెనర్జీ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. విడిగా చూసుకుంటే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీని వెంకీ అట్లూరి బాగానే తెరకెక్కించినట్లు చెప్పుకోవాలి. ఆయన గత సినిమా లక్కీ భాస్కర్ తో పోల్చుకుంటే మాత్రం ఇందులో కథను నడిపించిన విధానం అంత పర్ఫెక్ట్ గా ఉన్నట్లు కనిపించదు.

రేటింగ్: 3 /5

Next Story
Share it