Telugu Gateway
Cinema

చిరంజీవి విశ్వంభర

చిరంజీవి విశ్వంభర
X

మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు ప్రకటించింది. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీని యూవి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు కథను అందిస్తున్నది కూడా వశిష్ట నే. మెగా 156 మూవీ కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండగ రోజు విడుదల చేశారు. ఇది చూస్తే విశ్వంభర సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. బింబిసార సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ట ఇప్పుడు చిరంజీవి తో కలిసి విశ్వంభర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని ద్వారా అయన ఒక కొత్త ప్రపంచాన్ని చూపించనున్నాడు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. విశ్వంభర లో చిరంజీవికి జోడిగా అనుష్క శెట్టి నటించే అవకాశం ఉంది అని, మరో కీలక పాత్రలో మృణాల్ ఠాకూర్ నటిస్తారని ప్రచారం. అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story
Share it