Telugu Gateway
Cinema

పాగ‌ల్ ట్రైల‌ర్ రిలీజ్

పాగ‌ల్ ట్రైల‌ర్ రిలీజ్
X

విశ్వ‌క్ సేన్..నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన సినిమా పాగ‌ల్. ఈ సినిమా ఆగ‌స్టు 14న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం నాడు ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది. నా పేరు ప్రేమ్..నేను 1600 మంది అమ్మాయిల‌ను ప్రేమించా అంటూ విశ్వ‌క్ సేన్ చెప్పే డైలాగ్ తో ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. క‌న్పించిన ప్ర‌తి అమ్మాయిని ప్రేమిస్తూ చివ‌ర‌కు నివేదా పేతురాజ్ తో మాత్రం నీతోనే నాది అసలైన్ ల‌వ్ అన్న‌ట్లు చెప్పే సీన్ల‌తో ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో నివేదా పేతురాజ్ తోపాటు సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ లు కూడా న‌టించారు. ఇక్క‌డ గీత ఎక్క‌డ ఉంట‌ది సార్ అంటూ బండిపై వ‌చ్చిన యువ‌కుడు అడ్ర‌స్ అడిగితే హీరో చెప్పిన గీత‌ల పేర్లు విని అత‌గాడు మూర్చ‌పోయినంత ప‌ని అవుతుంది. ఈ సీన్ ట్రైల‌ర్ లో కామెడీగా ఉంది. విశ్వ‌క్ సేన్ ఫుల్ ఈ సినిమాలో వీర ప్రేమికుడిగా క‌న్పించ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

Next Story
Share it