విశ్వక్ సేన్ కు హిట్ దక్కిందా?!(Funky Review)

హీరో విశ్వక్ సేన్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫంకీ మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్...ట్రైలర్ కూడా ఫంకీ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని ఒకింత పెంచాయి. విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర యూనిట్ ముందే ఇందులో పెద్దగా కథ ఏమీ ఉండదు..ఓన్లీ ప్రేక్షకులను నవ్వించటమే లక్ష్యంగా ఈ సినిమా ని నిర్మించినట్లు వెల్లడించారు. సంక్రాంతికి అనగనగా ఒక రాజు వంటి మంచి హిట్ అందుకున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మించటంతో ప్రేక్షకులు ఈ మూవీ కూడా పక్కా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని ఆశించారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి. ఫంకీ సినిమా అంతా కూడా కథలో భాగంగా సినిమా నిర్మాణం చుట్టూనే తిరుగుంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ డైరెక్టర్. నాలుగు కోట్లతో సినిమా పూర్తి చేస్తానని చెప్పి ...బడ్జెట్ ను ఏకంగా నలభై కోట్ల రూపాయలకు పెంచుతాడు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి నిర్మాత నరేష్ కిందపడిపోతాడు. తర్వాత అయన స్టంట్ వేస్తారు. దీంతో మిగిలిని సినిమాను ఎలాగైనా కోటి రూపాయల బడ్జెట్ తో పూర్తి చేయించటానికి నరేష్ కూతురు కయాదు లోహర్ రంగంలోకి దిగుతుంది.
అక్కడ నుంచి ఏమి జరిగింది అన్నదే ఫంకీ మూవీ. అయితే ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఏ మాత్రం ఎమోషన్స్ లేని డైరెక్టర్ పాత్రలో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ కయాదు లోహర్ ఈ సినిమాలో కీలక పాత్రతో ఆకట్టుకుంది. తన లుక్స్ తో సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి స్థాయిలో నవ్వించటమే లక్ష్యంగా సినిమాను తెరకెక్కించినట్లు ప్రకటించినా కామెడీ కూడా పూర్తి స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. విశ్వక్ సేన్ తన శైలి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫంకీ మూవీ లో సంపత్ మరో కీలక పాత్రలో కనిపిస్తాడు. ఫంకీ మూవీలో నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజు, దర్శకులు హరీష్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ శంకర్ లు అతి పాత్రల్లో కనిపిస్తారు. నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడకపోయినా కామెడీ కూడా పూర్తి స్థాయిలో వర్క్ అవుట్ కాకపోవటంతో ఫంకీ మూవీ టైం పాస్ మూవీ గానే మిగులుతుంది.



