Telugu Gateway
Cinema

కామెడీ వర్క్ అవుట్ అయిందా?!(Vishnu Vinyasam Movie Review)

కామెడీ వర్క్ అవుట్ అయిందా?!(Vishnu Vinyasam Movie Review)
X

శ్రీ విష్ణు సినిమాలు మినిమమ్ గ్యారంటీ అన్న ఫీలింగ్ ఉంటుంది ఎక్కువ మంది ప్రేక్షకులకు. ఆయన గత సినిమా సింగిల్ కూడా అదే బాపతు. కలెక్షన్స్ అయితే ఒకింత బాగానే రాబట్టింది. ఈ సంక్రాంతికి వచ్చిన శర్వానంద్ సినిమా నారీ నారీ నడుము మురారిలో కూడా శ్రీ విష్ణు ఒక అతిధి పాత్రలో కనిపించాడు. శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన విష్ణు విన్యాసం సినిమా శుక్రవారం నాడు విడుదల అయింది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చిత్ర యూనిట్ చెప్పినంతగా ప్రేక్షకులను అంతగా నవ్వించలేకపోయింది అనే చెప్పాలి. ఇది ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ సినిమా.

ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో విష్ణు ఒక కాలేజీ లో జూనియర్ లెక్చరర్ (జెఎల్)గా పనిచేస్తాడు. శ్రీవిష్ణు, సత్య లు ఉంటే తమ సీట్లకు ఎసరు వస్తుంది అనే ఉద్దేశంతో ఫ్యాకల్టీగా ఉన్న బ్రహ్మాజీ, మరొకరు కలిసి వీళ్ళను కాలేజీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అయితే అదే కాలేజీ లో పనిచేసే నయన్ సారిక మాత్రం తన దగ్గర జెఎల్ గా శ్రీ విష్ణు ను నియమించుకునేందుకు ఓకే చెపుతుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అటు శ్రీ విష్ణుకు....ఇటు నయన్ సారిక కు ఇద్దరికీ ఒక పట్టాన పెళ్ళిసంబంధాలు సెట్ కావు. ఎందుకంటే శ్రీ విష్ణుకు ఉన్న జాతకాల పిచ్చి కూడా ఇందుకు ఒక కారణం. తన దగ్గర జె ఎల్ గా పెట్టుకున్న శ్రీవిష్ణు ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది నయన్ సారిక. మరి వీళ్ళ ప్రేమ సక్సెస్ అయిందా...ఇందులో వచ్చే ట్విస్ట్ లు ఏంటి అన్నదే విష్ణు విన్యాసం మూవీ. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు తనకు అలవాటు అయిన కామెడీ రోల్ కావటంతో అలవోకగా చేసుకుంటూ పోయాడు.

కాకపోతే ఇందులో శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకుల ఆశించిన స్థాయిలో కామెడీ లేదు అనే చెప్పాలి. నయన్ సారిక ఈ జనరేషన్ అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమెకు అంత డెప్త్ ఉన్న పాత్ర దక్కలేదు అనే చెప్పాలి. ఆయ్ మూవీ లో ఆమె తన నటనతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇందులో కూడా మంచి పాత్రే కానీ..నటనకు స్కోప్ తక్కువ ఉంది అనే చెప్పాలి. సినిమా అంతా కూడా కాలేజీ...హీరో..హీరోయిన్ల చుట్టూనే తిరుగుతుంది ఎక్కువ భాగం. మిగిలిన పాత్రలు సినిమాలో ఎప్పుడో ఆలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా గత సినిమాల్లో ఎన్నో సార్లు చూసిన తరహాదే కావటంతో ప్రేక్షకులకు ఇందులో పెద్దగా కొత్తదనం కనిపించదు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో మురళి శర్మ, సత్యం రాజేష్, గోపరాజు రమణ, సత్యాలు కనిపిస్తారు. మొత్తం మీద చూస్తే విష్ణు విన్యాసం మూవీ రొటీన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. చాలా సార్లు ఈ సినిమా రవితేజ మూవీ వెంకీ ని గుర్తుకు తెస్తుంది.

రేటింగ్ :2 .5 /5

Next Story
Share it