'విరాటపర్వం' విడుదల సమ్మర్ లో
BY Admin13 Jan 2021 10:55 AM IST
X
Admin13 Jan 2021 10:57 AM IST
దగ్గుబాటి రానా నటిస్తున్న సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాలో సాయిపల్లవి కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల అయిన లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని రానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
వచ్చే వేసవిలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతి శుభాకాంక్షలతో న్యూలుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రియమణి కూడా ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఉడుగుల వేణు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Next Story