ఫిబ్రవరి 26 న పెళ్లి !

విజయదేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కొద్దిరోజుల క్రితమే వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చినా అటు విజయదేవరకొండ కానీ..ఇటు రష్మిక లు అధికారికంగా స్పందించలేదు. వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన కార్డు ప్రకారం వీళ్ళ పెళ్లి ఫిబ్రవరి 26 న జరగనుంది. అది కూడా అతి తక్కువ మంది సమక్షంలో ఈ వేడుక జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో పెళ్లి జరగనున్నట్లు సమాచారం.



