పూరి ఈ మూవీ తో అయినా హిట్ కొడతాడా!

ఒకరు వరస విజయాలతో దూసుకెళుతున్న హీరో. ఒక్క హీరో పాత్రలే కాకుండా ఏ అవకాశం వచ్చినా కూడా పాత్ర నచ్చితే దానికి ఓకే చెపుతూ ముందుకు వెళుతున్నాడు. ఆయనే తమిళ నటుడు విజయ్ సేతుపతి. మరో వైపు గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. కొద్ది నెలల క్రితమే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయింది. శుక్రవారం నాడు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈ మూవీ టైటిల్ ని ప్రకటించటంతో పాటు ఇందులో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.



